BigTV English

Konda Surekha : మీరు మాకు ఆదర్శం… ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా…

Konda Surekha : మీరు మాకు ఆదర్శం… ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా…

Konda Surekha: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆ రాష్ట్ర వ్యవహారాలలో ఎప్పుడు ముందంజలో ఉంటారు. తన పనిని తాను నిర్వర్తించడంలో ఏ రోజు కూడా ఆమె వెనకడుగు వేసిందే లేదు. అయితే ప్రత్యర్థి కేటీఆర్ పైన ఆగ్రహంతో అతడు చేసిన బండారాలను బయట పెట్టడం కోసం అతడి వల్ల ఇబ్బంది పడిన సినీ సెలబ్రిటీల పేర్లు కూడా బయటపెట్టి ఒక్కసారిగా చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు. కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సమంత (Samantha) – నాగచైతన్య(Naga Chaitanya) విడిపోవడానికి కారణం కేటీఆర్ (KTR)అంటూ బాంబు పేల్చింది. అక్కడితో ఆగిపోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయాలనుకున్నప్పుడు నాగార్జున రిక్వెస్ట్ చేశారని అయితే కేటీఆర్ సమంతాను తన దగ్గరకు పంపిస్తే, కన్వెన్షన్ హాల్ కూల్చివేత ఆపేస్తామని చెప్పాడు. దీంతో నాగార్జున సమంతాను బలవంత పెట్టాడు. ఆ రిజెక్ట్ చేయడంతో ఇద్దరికీ విడాకులు ఇప్పించారు అంటూ ఆరోపణలు చేస్తూ చేసిన కామెంట్లు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి.


భగ్గుమన్న సినీ సెలెబ్రిటీస్..

ఆమె అలా వ్యాఖ్యలు చేసిందో లేదో వెంటనే ప్రకాష్ రాజ్ కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏంటి సిగ్గులేని రాజకీయాలు..? సినీ ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తర్వాత అక్కినేని నాగార్జున కూడా ఈ విషయంపై స్పందించారు. అక్కినేని నాగార్జున ట్వీట్ ద్వారా.. గౌరవనీయ మంత్రివర్యులైన కొండా సురేఖ దయచేసి మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి. ఆడవారి పట్ల మీరు చేస్తున్న వ్యాఖ్యలు అనుచితం. మా కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలు పూర్తిగా తెలుసుకోకుండా మీరు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. దయచేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అంటూ పోస్ట్ చేశారు.


రాజకీయ లబ్ధి కోసం నన్ను వాడుకోకండి – సమంత

ఇక సమంత కూడా మీ రాజకీయ లబ్ధి కోసం నన్ను ఒక పావులా వాడుకోకండి అంటూ పోస్ట్ పెట్టింది. నేను – నాగచైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోయాము. ఎవరి బలవంతం వల్ల మేము విడిపోలేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్టీఆర్, సింగర్ చిన్మయి, నాని ఇలా చాలామంది సెలబ్రిటీలు సమంతాకు అండగా నిలుస్తూ వరుస ట్వీట్లు పెడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దిగివస్తూ సమంతాకు క్షమాపణలు కోరుతూ ట్వీట్ పెట్టింది.

మీరే నాకు ఆదర్శం – కొండా సురేఖ ట్వీట్..

కొండా సురేఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే.. అంతేకానీ నేను మీ మనోభావాలను దెబ్బతీయడానికి అనలేదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా.. అంటూ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం సమంతా కు క్షమాపణలు కోరుతూ కొండా సురేఖ చేసిన ట్వీట్ మళ్లీ వైరల్ గా మారుతోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×