Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్నను పెళ్లి విషయంలో సుమిత్ర, పారిజాతం బలవంత పెడుతుంటే కార్తీక్ అడ్డుపడతాడు. జ్యోత్స్నను పెళ్లి విషయంలో మనం అడగాలి కానీ బలవంత పెట్టకూడదని చెప్తాడు. అందుకు పారిజాతం నీకేంటి పెళ్లాం పిల్లలతో ఉన్నావు. దాని బాద నీకెలా తెలుస్తుంది. పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే ఇంకా పెళ్లి చేయరా అని అడుగుతారు. పెళ్లి ఆగిపోయిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే చెవులు కొరికేసుకోరు అంటుంది. చెవులు కాదు ముక్కులు కూడా కొరికేసుకోని నాకు అభ్యంతరం లేదు. లేదా నా వల్ల మీకు ఇబ్బందిగా ఉందని చెప్పండి నేను బయటకు వెళ్తాను అంటుంది జ్యోత్స్న. అందుకు దీప కోపంగా అర్థం లేకుండా మాట్లాడతావేంటి జ్యోత్స్న అడిగిన దానికి సమాధానం చెప్పు పోతాను పోతాను అంటే ఎక్కడికి పోతావు మన గురించి ఆలోచించే వాళ్ళు మన మేలు కోరుకునే వాళ్లు ఇక్కడ తప్ప ఎక్కడా లేరు అంటుంది.
ఆ మాట దీనికి అర్థం కావడం లేదు దీప. ఏం చేస్తాం. మాకీ బాధలు రాసిపెట్టి ఉన్నాయి అంటూ సుమిత్ర బాధపడుతుంటే.. మమ్మీ నా వల్ల మీరేం బాధపడొద్దు అంటుంది జ్యోత్స్న. అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పు అంటుంది. చేసుకోను అంటుంది జ్యోత్స్న అయితే సూరజ్‌ను చేసుకుంటావా..? అని పారిజాతం అడిగితే.. జ్యోత్స్న కోపంగా నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోవద్దని అంటుంది. అందుకు పారిజాతం నాకు సంబంధం లేదా..? అంటూ షాక్ అవుతుంది. నాకే సంబంధం ఉంది. అంటూ పారిజాతం కోప్పడుతుంది. అది నా మనవరాలు అది నా సొంత మనవరాలు అంటూ నిజం చెప్పబోతుంటే.. దశరథ పిన్ని నువ్వు ఆగు అంటాడు.. పారిజాతం ఆగిపోతుంది. సుమిత్ర కూడా అత్తయ్య గారు మీరు ఆగండి.. మనం అందరం చూసి దానికి ఒక మంచి సంబంధం చూస్తున్నాం.. అది చేసుకుంటుంది ఎక్కడికి వెళ్లదు అంటుంది.
జ్యోత్స్న నేను చేసుకోను అంటుంది. ఎందుకు చేసుకోవు అంటూ మళ్లీ పారిజాతం నిలదీస్తుంది. ఆ సూరజ్ గాడిని మర్చిపోలేక వాడినే మనసులో పెట్టుకుని పెళ్లి చేసుకోనని చెప్తుంది అంటూ పారిజాతం అంటే జ్యోత్స్న కోపంగా అవును సూరజ్ నే పెళ్లి చేసుకుంటాను. అని చెప్తుంది. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. పారిజాతం మరింత కోపంగా ఏంటి..? సూరజ్‌ను పెళ్లి చేసుకుంటావా..? అని అడుగుతుంది. అవును ఇప్పటి వరకు మనం అనుకున్నదే జరిగిందా..? లేదు కదా మనం ఒకటి అనుకున్నాం దేవుడు ఇంకోటి అనుకున్నాడు.. కానీ అలాగని ప్యూచర్‌ను గాలికి వదిలేసి బతకలేము ఇంత వరెస్ట్ సిచ్యుయేషన్‌లోనైనా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. నా గోల్స్ రీచ్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అంటూ జ్యోత్స్న చెప్పగానే.. అదంతా కాదు నువ్వు పెళ్లి విషయంలో మాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నువ్వు పెళ్లి చేసుకోవాలి అని సుమిత్ర చెప్తుంది.
అందుకు జోత్స్న.. మనకు పోయినవన్నీ తిరిగి వచ్చాకే పెళ్లి చేసుకుంటాను.. అన్ని తిరిగి వస్తాయి.. తిరిగి వచ్చేలా చేస్తాను.. నేను రప్పిస్తాను.. అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటూ జ్యోత్స్న చెబితే.. దశరథ కూల్‌గా నా మాట వినమ్మా.. ఇదొక సుడిగుండం దీంట్లో ఈదే ప్రయత్నం నువ్వు చేయోద్దు అంటాడు. చావుకు తెగించినవాడికి సుడిగుండం ఏంటి..? అగ్నిగుండం ఏంటి..? నేను లూజర్‌ను కాదు ఫైటర్‌ను నా మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద నాకు ప్రేమ ఉంది. నాకోసం మీరు అన్ని కోల్పోయారు. నేను మీకోసం అన్ని తీసుకొస్తాను. ఆరోజు నేను అడుగుతాను మమ్మీ, డాడీ నాకు పెళ్లి చేయండి అని అంతవరకు నన్నేం అనొద్దు, అడగొద్దు అని చెప్పగానే.. అందరూ షాకింగ్‌గా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.