BigTV English

Pawan Kalyan: అంజనీ పవన్ దత్త పుత్రికా..ఆ అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే ఫ్యాన్స్ గుండె గుబేల్..!

Pawan Kalyan: అంజనీ పవన్ దత్త పుత్రికా..ఆ అమ్మాయి ఎవరి కూతురో తెలిస్తే ఫ్యాన్స్ గుండె గుబేల్..!

Pawan Kalyan.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 11 రోజుల క్రితం తాను వేసుకున్న ప్రాయశ్చిత్త దీక్షను నేటితో విరమించారు. ఈ సందర్భంగా ఇద్దరు కూతుర్లతో కలిసి పవన్ కళ్యాణ్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆ ఇద్దరు అమ్మాయిల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇద్దరమ్మాయిలు చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా వారసురాళ్లు వచ్చేశారు అంటూ కామెంట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


ఇకపోతే అందులో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ – రేణూ దేశాయ్ సంతానం ఆధ్య కాగా , ఇంకో అమ్మాయి అన్నా లెజినోవా – పవన్ కళ్యాణ్ కూతురు అంటూ అందరూ అనుకున్నారు. అయితే అన్నా లెజినోవాను పవన్ కళ్యాణ్ 2013లో వివాహం చేసుకున్నారు. కానీ ఇక్కడున్న అమ్మాయి ఆధ్య వయసుతో సమానంగా కనిపిస్తోంది. దీంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఈ పాప పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా సంతనమా..? లేక పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారా? ఒకవేళ దత్తత తీసుకొని ఉంటే ఎప్పుడో ఈ విషయం మీడియా ముందు ప్రకటించేవారు కదా..! ఎందుకు ప్రకటించలేదు..? ఇలా పలు రకాల అనుమానాలు నెటిజెన్స్ లో వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వాస్తవానికి అన్నా లెజినోవా – పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకోక ముందే ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తికి అన్నా లెజినోవాకి జన్మించిన పాపే ఈ అమ్మాయి. అయితే అతడి నుంచి విడిపోయిన తర్వాత అన్నా లెజినోవా 2013లో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. అన్నా.. మొదటి భర్త సంతానాన్ని పవన్ కళ్యాణ్ సొంత కూతురిగా స్వీకరించారు. ఈ క్రమంలోనే తన తల్లి అంజనీ దేవి పేరు అలాగే తన పేరు కలిసేలా.. “పొలేనా అంజనీ పవనోవా” అని కూతురికి నామకరణం చేశారు. ఇదన్నమాట అసలు సంగతి. మొత్తానికైతే ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ కి సొంత కూతురు కాకపోయినా ఈ అమ్మాయిని.. తన సొంత కూతురుగా చేసుకోవడంతో అభిమానులు ఇంకా ఉప్పొంగిపోతూ.. తమ అభిమాన హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మనసు గొప్పది అని, అందుకే తన భార్య మొదటి భర్త సంతానాన్ని కూడా తన బిడ్డగా స్వీకరించడం తో ఆయన మరో మెట్టు ఎక్కారు అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×