BigTV English

Koratala Siva: ఆ స్టార్ హీరోతో సినిమా చేయను.. దేవర డైరెక్టర్ కఠిన నిర్ణయం వెనుక కారణం..?

Koratala Siva: ఆ స్టార్ హీరోతో సినిమా చేయను.. దేవర డైరెక్టర్ కఠిన నిర్ణయం వెనుక కారణం..?

Koratala Siva.. ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఆచార్య మినహా సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్.. అప్పటివరకు నిర్మించుకున్న ఒక స్థాయిని ఆచార్య సినిమాతో ఒక్కసారిగా కూల్చేసుకున్నారని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ, దర్శకుడిగానే కాదు రచయితగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు 1998లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటున్న ఈయనకు సడన్ సినిమాపై ఆసక్తి కలిగిందట. అలా వరుసకు బావ అయిన పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఒక్కడున్నాడు, ఊసరవెల్లి, మున్నా, బృందావనం వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారారు.


ఆచార్య మినహా ఫ్లాప్ చవిచూడని డైరెక్టర్ గా గుర్తింపు..

ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా అన్ని చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. మిర్చి సినిమాతో నంది అవార్డును కూడా అందుకున్నారు. అప్పటివరకు ఫ్లాప్ చవిచూడని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కొరటాల శివకు ఆచార్య రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చి పడింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో పూర్తి భారం కొరటాల శివ పైనే వేశారు. దీంతో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కొరటాల శివ. అయితే ఎలాగైనా సరే మంచి కథతో ప్రేక్షకులను అలరించాలని, మళ్లీ తన టాలెంట్ నిరూపించుకోవాలని కసితో, పట్టుదలతో ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు కొరటాల శివ సక్సెస్ కి అద్దం పట్టింది. ఆయనపై విమర్శలు చేసిన వారంతా ఈ ఒక్క సినిమాతో సైలెంట్ అయిపోయారని చెప్పవచ్చు.


పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యను..

ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివకు ఒక ప్రశ్న ఎదురవగా ఆయనతో సినిమా చేయకపోవచ్చు ఏమో అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సినిమా ఎప్పుడు చేస్తారు ? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనికి కొరటాల శివ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. మరొకవైపు ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన కంప్లీట్ చేయాలి.ఆ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారో లేదో కూడా తెలియదు. ఇక రాజకీయాలలో బిజీ అయ్యారంటే ఆయన సినిమాల్లోకి రారు. ఇక బహుశా భవిష్యత్తులో ఆయనతో నేను సినిమా చేయనేమో అంటూ తెలిపారు కొరటాల శివ. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు కాబట్టే తాను ఆయనతో సినిమా చేసే అవకాశం లేదు అని స్పష్టం గా చెప్పేశారని సమాచారం.ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×