BigTV English
Advertisement

Koratala Siva : మిర్చి సీక్వెల్ ఉందా.. కొరటాల ఏమన్నాడంటే?

Koratala Siva : మిర్చి సీక్వెల్ ఉందా.. కొరటాల ఏమన్నాడంటే?

Koratala Siva : ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర మరికొన్ని గంటల్లో థియేటర్ల లో సందడి చెయ్యనుంది.. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా ఊరిస్తున్న దేవర సినిమా ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రోజు వసూళ్ల లో దేవర చిత్రం అరుదైన రికార్డ్‌ లను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంను ట్రేడ్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. ఈ క్రమంలో మిర్చి 2 సినిమా గురించి సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి..


దేవర సినిమాకు జనాలు కనెక్ట్ అవ్వాలని గత వారం రోజులుగా దేవర టీమ్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇక కొరటాల మాత్రం చివరి రెండు రోజులు కొరటాల శివ పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్‌ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ ‘దేవర’ ముచ్చట్లతో పాటు తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ప్రభాస్ తో సినిమా ఉంటుందని, ఇప్పటికే కొన్ని ఐడియాస్ ను ప్రభాస్ తో పంచుకున్నట్లుగా కొరటాల శివ తెలిపారు. ప్రభాస్‌ సైతం కొన్నింటి పట్ల ఆసక్తి చూపించారని, త్వరలోనే కథ రెడీ చేస్తాను అన్నట్లుగా హింట్ ఇచ్చేశాడు.. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే డార్లింగ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఆయనతో ఎలాంటి సబ్జెక్ట్‌ తో సినిమా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నిర్ణయించుకోలేదు. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ నచ్చే మిర్చి లాంటి మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ను రూపొందించాలని కోరుకుంటున్నట్లు గా కొరటాల తెలియజేశారు. వీరిద్దరి కాంబోలో గతంలో మిర్చి సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా కొరటాల తో ప్రభాస్ మరో సినిమా చేస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. వాటన్నింటిని పూర్తి చేసేందుకు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్‌’ సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీతారామం చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా, సలార్ 2, కల్కి 2 సినిమాలు చెయ్యాల్సి ఉంది.. ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఎప్పుడు తన మిర్చి చిత్ర దర్శకుడికి అవకాశం ఇస్తారు అనేది చూడాలి. ఈ సినిమాలు అయ్యాకే ఆ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×