BigTV English
Advertisement

Devara : రిలీజ్ కు ముందే గుంటూరు కారం రికార్డులు బ్రేక్

Devara : రిలీజ్ కు ముందే గుంటూరు కారం రికార్డులు బ్రేక్

Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ సునామీ మరికొన్ని గంటల్లో థియేటర్లను ముంచెత్తబోతోంది. అయితే రిలీజ్ కు ముందే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే, అయితే తాజాగా గుంటూరు కారం రికార్డులను బ్రేక్ చేసింది దేవర.


రిలీజ్ కు ముందే గుంటూరు కారం రికార్డు బ్రేక్ 

దేవర: పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి కేవలం కొన్ని గంటల దూరంలో ఉంది. ఈ మాగ్నమ్ ఓపస్ థ్రిల్లింగ్ సినిమాను చూడడానికి ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దేవర కొత్త రికార్డును బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ దేవర సినిమాకు సంబంధించి 42 షోలను హోస్ట్ చేస్తుండడం విశేషం. రేపు ఉదయం 1 గంటలకు స్క్రీనింగ్‌తో ప్రారంభమవుతుంది. ఈ థియేటర్ లో అత్యధిక షోలను స్క్రీనింగ్ చేసిన సినిమాగా గుంటూరు కారం పేరు మీద ఇప్పటిదాకా ఉన్న రికార్డును ఇప్పుడు దేవర సొంతం చేసుకుంది. గతంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీకి సంబంధించి 41 షోలను స్క్రీనింగ్ చేసింది. కాగా భారీ అంచనాలు ఉన్న దేవర మూవీ 100 కోట్ల ఓపెనింగ్ రాబడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


హిందీ బుకింగ్స్ పై ఫ్యాన్స్ అప్సెట్ 

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ ‘దేవర’. ఇందులో హిందీ భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, మురళీ శర్మ, తాళ్లూరి రామేశ్వరి, అజయ్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

కాగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా దేవర అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రీ సేల్స్ లో రూ.75 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఎన్టీఆర్ తన మొదటి సోలో రూ. 100 కోట్ల ఓపెనింగ్ మూవీగా దేవర పేరును నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. అయితే ప్రీ సేల్స్ తెలుగులోనే ఎక్కువగా ఉన్నాయి. హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ ను లేటుగా ఓపెన్ చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు అప్సెట్ గా ఉన్నారు. హిందీ వెర్షన్‌కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లను ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్‌లు సినిమా ప్రీమియర్‌లకు ఒక రోజు ముందు తెరిచాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యంగా ఓపెన్ కాకపోయి ఉంటే ప్రీ సేల్స్ సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ అభిమానులు. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల అంచనా మేరకు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దేవరా హిందీ వెర్షన్ రూ. 10–12 కోట్ల ఓపెనింగ్ ను రాబట్టబోతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×