Salar 2 : ప్రశాంత్ నిల్ కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అసలైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పటికే దర్శకుడుగా కన్నడలో ఫిలిమ్స్ చేసిన కూడా కే జి ఎఫ్ సినిమా మాత్రమే ప్రశాంత్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. అంటే ఒక కమర్షియల్ సినిమాను ఇలా కూడా చేయొచ్చు అంటూ ఒక కొత్త నిర్వచనాన్ని చూపించాడు. కే జి ఎఫ్ సినిమా చాలామందికి ఇప్పటికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో యష్ చూపించిన విధానం, సీన్స్ ఎలివేట్ చేయటం, ఎమోషన్ ని హార్ట్ టచ్ చేయాలా డిజైన్ చేయడం ఇవన్నీ కూడా ఆ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి.
బేసిగ్గా కన్నడ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎక్కడో ఇంకా వాళ్ళు వెనకబడ్డారు. అని ఒక అపోహ ఉండేది. వాటన్నిటికీ సక్సెస్ఫుల్ గా చెక్ పెట్టిన సినిమా మాత్రం కేజిఎఫ్ పని చెప్పాలి. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా కూడా మంచి కలెక్షన్స్ను వసూలు చేసింది. ఇక్కడితో ప్రశాంత్ నీల్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటేనే అంచనాలు ఆకాశాన్ని అంటడం మొదలయ్యాయి.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించిన విషయం మనకు తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆది పురష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఒక సరైన కమర్షియల్ హిట్ సినిమా ప్రభాస్ కి పడలేదు అని అనుకునే తరుణంలో, ప్రశాంత్ సలార్ సినిమాతో ఒక హిట్ అందించాడు. ఈ సినిమా మళ్లీ కోట్లు కొల్లగొట్టింది.
Also Read : Ntr: మొత్తానికి వంశీ అనుకున్నది చేసేసాడు, తమిళ్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టాడు
ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ 2 సినిమా చేయాల్సి ఉంది. దాదాపు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అనుకునే తరుణంలో నిర్మాణ సంస్థ అఫీషియల్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో కొరియన్ స్టార్ డాన్ లీ ను తీసుకుపోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పిరిట్ సినిమాలో డాన్ లీ ను తీసుకో సందీప్ రెడ్డి వంగ అంటూ పోస్టులు చేశారు. అయితే సందీప్ ఇప్పటివరకు కాస్టింగ్ మొదలుపెట్టలేదు. ప్రశాంత్ మాత్రం సలార్ 2 కు తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక డాన్ నీ కూడా ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని పోస్ట్ చేశాడు. ఆ స్టోరీలో సలార్ పోస్టర్ తో పాటు ఒక లైక్ సింబల్ కూడా ఉంది. ఇక్కడితో సలార్ ప్రాజెక్టులో డాన్ లీ జాయిన్ అవుతున్నాడని చాలామంది కన్ఫామ్ చేసేసుకున్నారు.