Mynampally warning: తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటూ ఓ వైపు బీఆర్ఎస్.. మరోవైపు బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ విషయంలో కమల నాధుల కంటే కారు పార్టీ నేతలు ముందు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదో విధంగా అధికార పార్టీ నేతలను రెచ్చగొడుతూ నిత్యం మీడియాలో ఉండేందుకు తహతహలాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో మైనంపల్లి వర్సెస్ హరీష్‌రావు. తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య ఛాలెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. పాదయాత్రలో హరీష్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం జరిగి 24 గంటల తర్వాత అప్పుడు రియాక్ట్ అయ్యారు హరీష్‌రావు.
పనిలో పనిగా కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు వ్యవహారాన్ని టచ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. దీంతో మైనంపల్లి మీడియా ముందుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీతోపాటు కేసీఆర్, హరీష్‌రావు ఇలా వరసపెట్టి వారిని ఆడేసుకున్నారు.
గడిచిన పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘన కార్యాలను మీడియా ముందు పెట్టి ఉతికి ఆరేశారు మైనంపల్లి. ఉద్యమకారులను రెచ్చగొట్టి 1200 మంది కుటుంబాలను నాశనం చేయలేదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు మూసీ పేరు చెప్పి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ALSO READ: గ్రూప్-3 విద్యార్థులకు నేడు హాల్ టికెట్లు…ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
మంధనిలో అడ్వకేట్ కుటుంబాన్ని నరికి చంపింది మీ ప్రభుత్వం కాదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దమ్మంటే తాను ఒక్కడినే వస్తా.. నీవు వస్తావా అంటూ సవాల్ విసిరారు మైనంపల్లి. సోషల్ మీడియా ద్వారా తిట్టిస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు బయటకు వస్తే నీవు తట్టుకోలేవంటూ సున్నితంగా హెచ్చరించారు.
తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే విధంగా బీఆర్ఎస్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న నేతలపై కారు పార్టీ ఫోకస్ చేసిందని అంటున్నారు.