BigTV English

KotaBommali PS Movie Review : లింగి లింగి లింగిడి.. థియేటర్లో సందడి చేస్తున్న కోటబొమ్మాళి

KotaBommali PS Movie Review : లింగి లింగి లింగిడి.. థియేటర్లో సందడి చేస్తున్న కోటబొమ్మాళి

KotaBommali PS Movie Review : కోటబొమ్మాళి .. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి మెయిన్ రీజన్ స్టోరీనో లేక హీరోనో లేక డైరెక్టరో కాదు. ఈ సినిమా నుంచి వచ్చిన ఒకపాటే హైప్ క్రియేట్ చేసింది. లింగి లింగి లింగిడి అంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరిని ఓ రేంజ్ లో డాన్స్ వేయించిన ఈ సాంగ్ మూవీ పేరుని బాగా పాపులర్ చేసింది. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.


చిత్రం : కోటబొమ్మాళి

నటీనటులు : శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు


దర్శకుడు: తేజ మార్ని

నిర్మాత : బన్నీ వాసు, విద్యా కొప్పినీడి

విడుదల తేదీ : నవంబర్ 24, 2023

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బాగా ఎక్కువైన తర్వాత రీమేక్స్ కాస్త తగ్గాయి. ఆల్రెడీ థియేటర్లలో విడుదలైన సినిమాలను ఇంట్లోనే చూడడానికి ఇష్టపడుతున్నారే తప్ప రీమేక్ చేస్తే థియేటర్ల వరకు వచ్చి చూడాలి అన్న కంపల్సన్ లేకుండా పోయింది. ఓటీటీకి బాగా అలవాటు పడిన జనం.. డబ్బింగ్ వెర్షన్ ఉండగా మళ్లీ ఇంకోసారి చూడడం ఎందుకు అనుకుంటారు. కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా రెండు సంవత్సరాల క్రితం వచ్చిన నాయట్టు అనే మూవీని కోటబొమ్మాళి పీఎస్‌గా రీమేక్ చేశారు. ఈ మూవీలో సీనియర్ నటుడు శ్రీకాంత్, వరలక్ష్మి ,రాహుల్ ,విజయ్ ,శివాని రాజశేఖర్ తదితరులు నటించారు.

కథ:

ఒక ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక చిన్న కథ అక్కడ నిర్దోషుల జీవితాలను ఎలా మలుపు తిప్పింది అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. పొలిటికల్ పంచులతో, మంచి బోల్డ్ కంటెంట్ డైలాగ్స్ తో మూవీ బాగా కమర్షియల్ ఓరియంటెడ్ గా ఉంది. ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకులకు.. పోలీసు వ్యవస్థకు మధ్య జరిగే అధికారిక పోరును ఈ సినిమాలో అద్భుతంగా ప్రదర్శించారు. రాజకీయ నాయకులు చొరవ చేసుకోవడం వల్ల కొంతమంది పోలీసులు ఎలా అనవసరంగా బలైపోతున్నారు అనే విషయాన్ని మూవీలో హైలెట్ చేశారు.

విశ్లేషణ :

ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ చాలా అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ కెరియర్ లోనే గుర్తుండిపోయే ఒక పాత్రను చేశాడు అని ఎందరో సెలబ్రిటీలు ఈ సినిమా గురించి పొగుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్ వరలక్ష్మి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఎన్నికల గురించి వివరిస్తూ వచ్చిన పాట అద్భుతంగా ఉంది.

ఈ మూవీ కేవలం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంది.. వృత్తికి న్యాయం చేయాలనుకునే పోలీస్.. పదవి కోసం బతికే రాజకీయ నాయకుడు.. భవిష్యత్తును నిర్ణయించే ఓటుని కులానికో ,మతానికో ,డబ్బుకో అమ్ముకునే ఓటరు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో విడుదలైన ఈ మూవీ ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటివరకు మనం చూసిన ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో తప్పు ఏకపక్షంగా చూపిస్తారు.. అయితే ఇందులో ఓటర్లు సజావుగా ఉంటే రాష్ట్రంలో రాజకీయం సజావుగా సాగుతుంది అని ఇన్ డైరెక్ట్ ఇచ్చినట్లు అర్దం అవుతుంది. మొత్తానికి ఈ సినిమాలో శ్రీకాంత్ అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

చివరిగా.. ఒక్కమాటలో చెప్పాలంటే కోటబొమ్మాళి.. మంచి యాక్షన్ పొలిటికల్ డ్రామా

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×