BigTV English

World Cup Pitch Report : వరల్డ్ కప్ ఫైనల్..‘పిచ్’ గుట్టు తెలిసింది..

World Cup Pitch Report  : వరల్డ్ కప్ ఫైనల్..‘పిచ్’ గుట్టు తెలిసింది..

World Cup Pitch Report : వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మాదాబాద్ లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగింది. అయితే ఇండియా ఓటమికి రకరకాల కారణాలు అందరూ చెప్పారు. అయితే పిచ్ స్వభావంపై ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఈ విషయంపై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఏం చెప్పాడో రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు.


ఆరోజు ఫైనల్ మ్యాచ్ రోజున పిచ్ ఎవరికీ అర్థం కాని రీతిలో స్పందించడం గమనించాం. ఎందుకిలా జరిగిందో ఎవరికి అర్థం కాలేదని అశ్విన్ అన్నాడు. అయితే దానిని కరెక్టుగా అంచనా వేసి, ఆ పిచ్ కి తగినట్టుగా ఆసిస్ కమిన్స్ బౌలింగ్ చేసిన విధానం మాత్రం సూపర్బ్ అని అన్నాడు. ఇదేలా సాధ్యమైందో నాకు అంతుపట్టలేదని తెలిపాడు.

టోర్నీలో పెద్దగా ప్రభావం చూపించని ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అసలైన ప్రొఫెషనల్స్ గా ఆడిందని అన్నాడు.కమిన్స్ బౌలింగ్ వేసేటప్పుడు నలుగురు నుంచి ఐదుగురు ఫీల్డర్లను ఒకే దగ్గర మోహరించాడు. తను ఫాస్ట్ బౌలర్ అయి ఉండి కూడా ఆఫ్ స్పిన్నర్‌లా బౌలింగ్ చేసిన విధానం అద్భుతమని అన్నాడు. ఆ పిచ్ మీద బౌలింగ్ తో ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ చేశాడని తెలిపాడు. ముఖ్యంగా స్టంప్ లైన్ హిట్ చేస్తూ ఆఫ్ కట్టర్లు వేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. స్టంప్ లైన్ దిశగా 6 మీటర్లలోపే అతను బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు.


బ్యాటర్లకు డ్రైవ్ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదని అన్నాడు. ఇదంతా చూసి పిచ్ ని ఇంత గొప్పగా ఎలా స్టడీ చేశారో అర్థం కాలేదు. అందుకని అక్కడే మ్యాచ్ చూస్తున్న ఆస్ట్రేలియా చీఫ్  సెలక్టర్ జార్జ్ బెయిలీ దగ్గరికి వెళ్లాను. ఎప్పుడూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు కదా.. ఈసారి టాస్ గెలిచి ఎందుకు చేయలేదని అడిగాను. అలాగే అసలు పిచ్ సంగతి ఏమిటి? మీరు దానిపై ఏమనుకుంటున్నారని ప్రశ్నించాను.

దాంతో ఆయన అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్ పిచ్ గుట్టు విప్పాడని అన్నాడు. ఆ పిచ్ స్టడీ చేసిన విధానం వారికెంతో మేలు చేసిందని, వరల్డ్ కప్ నే తీసుకొచ్చేలా చేసిందని అన్నాడు.ఇంతకీ పిచ్ గురించి ఏం చెప్పాడంటే ‘‘మేం భారత్ లో చాలా సిరీస్‌లు ఆడాం. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాం.ఎర్రమట్టి పిచ్ అయితే పగుళ్లు వస్తుంది. కానీ నల్లమట్టి పిచ్ అలా రాదు. అంతేకాదు రాత్రివేళ మరింత మంచిగా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఎర్రమట్టి పిచ్ మీద మంచు ప్రభావం ఉండదు. అయితే నల్లమట్టి మీద మధ్యాహ్మం బంతి స్పిన్ తిరుగుతుంది. కానీ రాత్రి సమయానికి కాంక్రీట్ మాదిరిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోతుంది. ఇదే మేం ఎక్స్ పెక్ట్ చేశాం…అదే కరెక్టుగా జరుగుతోంది’’ అని అన్నాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

అంటే పిచ్ తయారు చేసిన క్యూరేటర్లకి కూడా తెలీని విషయాలను ఆస్ట్రేలియా గమనించి, ఆ ప్రకారం ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంది. ఆ పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసిన జట్టుని ఎలా ఇబ్బంది పెట్టాలి. ఏ తరహా బాల్స్ వేయాలనేది అంతా గ్రౌండ్ వర్క్ చేసుకుని ఆ ప్రకారం వచ్చారు. మరి మనవాళ్లు ఆ పిచ్ మీద ఇంత కరెక్ట్ గా ఆలోచించారా? లేదా? అనేది అందరినీ డైలమాలో పడేస్తుంది.

అశ్విన్ చివర్లో మాట్లాడుతూ నేను వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ కే పరిమితమయ్యాను. మంచి రిథమ్ తో బౌలింగ్ చేశాను. కానీ 11మంది జట్టులో అవకాశం దక్కలేదు. దురదృష్టం అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Related News

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Big Stories

×