BigTV English

Empuraan Collections : మోహన్ లాల్ వసూళ్ల వేట.. నాలుగో రోజు రికార్డుల ఊచకోత..

Empuraan Collections : మోహన్ లాల్ వసూళ్ల వేట.. నాలుగో రోజు రికార్డుల ఊచకోత..

Empuraan Collections : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కెరియర్ లో అత్యంత భారీ విషయాన్ని సొంతం చేసుకున్న మూవీ లూసిఫర్.. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాల వచ్చాయి కానీ ఆ సినిమాలు హిట్ అయినా అంతగా కలెక్షన్స్ ని వసూలు చేయలేకపోయాయి. ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఎంపురాన్ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మార్చి 27న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. లూసిఫర్ కి క్లైమాక్స్ నుంచి ఈ సినిమా కంటిన్యూ అవుతుంది. దాంతో సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మూత మోగిస్తుంది.. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడం మామూలు విషయం కాదు. ఇక నాలుగు రోజులకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..


ఎంపురాన్ మూవీ.. 

సూపర్‌స్టార్ మోహన్ లాల్ , స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన లూసిఫర్ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా ఎల్ 2 : ఎంపురాన్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్ కారణంగా ఈ సినిమాకు దాదాపు రూ.150 కోట్ల వ్యయం అయ్యింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు మొదలగు వారు కీలక పాత్రలు పోషించారు.. యాక్షన్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.


Also Read: పూలను ఒళ్ళంతా చుట్టుకొని నటి సంచలనం.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

నాలుగు రోజుల కలెక్షన్స్ ను చూస్తే.. 

ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. మోహన్‌లాల్ నట జీవితంలోనే ఈ స్థాయి విడుదల జరగడం ఇదే మొదటిసారి. ఇకపోతేఅడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రూ.60 కోట్లు రాబట్టి మోహన్ లాల్ చిత్రం నయా హిస్టరీ అందుకుంది. మార్చి 27న రిలీజ్ రోజున రూ.22 కోట్లు రాబట్టిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలిపి తొలి రోజు రూ.82 కోట్ల ఓపెనింగ్స్ వసూల్ చేసి రికార్డు బ్రేక్ చేసింది. 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.. అదే విధంగా మూడో రోజు 10 కోట్లకు పైగా వసూల్ చేసిందని తెలిసిందే. ఇక నాల్గోవ రోజు, ఉగాది పండగ సందర్బంగా మరో 15 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ పై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. మోహన్ లాల్ నటించిన సినిమాలు ఈ మధ్య కమర్షియల్ హిట్ అవుతున్నాయి. ఈ సినిమా మాత్రం కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని రాబడుతుంది. ఇకముందు ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×