SIP Investment Benefits: మీకు ప్రతి నెలా జీతం వస్తుంది, ఖర్చుల తర్వాత కొంత మిగులుతుంది. కానీ ఆ మిగిలిన డబ్బును అలా బ్యాంకులోనే వదిలేస్తే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇన్వెస్ట్ చేస్తేనే మీ సంపద పెరుగుతుంది. కానీ ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అలాంటప్పుడు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మీ కోసం అందుబాటులో ఉంది.
ప్రతీ నెలా లేదా
సిప్ అంటే చిన్న మొత్తాలను క్రమంగా పెట్టుబడి పెట్టే పద్ధతి. ఇది మ్యూచువల్ ఫండ్లలో ప్రతీ నెలా లేదా త్రైమాసికం లేదా సగం సంవత్సరానికి ఒకసారి మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. దీని స్పెషల్ ఏమిటంటే, చిన్న మొత్తాలు కూడా, కాల క్రమంలో మీకు పెద్ద మొత్తాలను అందిస్తాయి. దీని ద్వారా, మార్కెట్ హెచ్చుతగ్గులను అధిగమిస్తూ, మొత్తం పెట్టుబడిపై స్థిరమైన రాబడి పొందే ఛాన్స్ ఉంటుంది.
దీర్ఘకాలంలో గొప్ప రాబడి
ఈరోజుల్లో, చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు SIP (Systematic Investment Plan) ను ఎంచుకుంటున్నారు. దీని వల్ల మీరు దీర్ఘకాలంలో గొప్ప రాబడిని పొందవచ్చు. సంపద సృష్టి అనేది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితేనే కాదు. చిన్న మొత్తాలతో క్రమంగా, తెలివిగా పెట్టుబడి పెడితే, కూడా మీరు ఆర్థిక భద్రతను పెంచుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రతి రెండో వ్యక్తి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే సిప్ మాత్రమే అందించే టాప్ 5 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సౌలభ్యం (Flexibility)
SIP పెట్టుబడి చేయడం చాలా సులభం, ఎందుకంటే దీనిలో పెట్టుబడి వ్యవధి, మొత్తానికి సంబంధించి సౌలభ్యం ఉంటుంది. మీ వీలుని బట్టి నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక ప్రాతిపదికన పెట్టుబడి చేయవచ్చు. అలాగే, మీ అవసరాలకు అనుగుణంగా SIPను నిలిపివేయడం లేదా తాత్కాలికంగా పాజ్ చేయడం కూడా వీలవుతుంది. మీరు ఏదైనా ఆర్థిక అవసరాన్ని ఎదుర్కొన్నప్పుడు, SIP నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే, ఇక్కడ మీరు పెట్టుబడిపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు.
Read Also: Ugadi Offer: రూ.16500కే ప్రీమియం ఫీచర్లతో డెల్ ల్యాప్‌టాప్. ..
2. రూపాయి ఖర్చు సగటు (Rupee Cost Averaging)
మార్కెట్ ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండదు. కానీ SIP ద్వారా పెట్టుబడి పెడితే, మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు. అంటే మార్కెట్ పడిపోయినప్పుడు, ఎక్కువ యూనిట్లు పొందడం, మార్కెట్ పెరిగినప్పుడు, తక్కువ యూనిట్లు కేటాయించబడతాయి. దీని వల్ల, మొత్తం పెట్టుబడి విలువ సగటుగా ఉంటుంది. మార్కెట్ క్షీణించినా, లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇతర పెట్టుబడి మార్గాల్లో సాధించడం కష్టం.
3. సమ్మేళనం శక్తి (Power of Compounding)
SIPలో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే, మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అంటే, మీ పెట్టుబడి నుంచి లభించిన వడ్డీపై మరింత వడ్డీ లభిస్తుంది. దీన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఉదాహరణకు, మీరు నెలకు రూ.5,000 SIPలో పెట్టుబడి పెడితే, 20 సంవత్సరాలకు 12% సగటు రాబడితో మీ మొత్తం పెట్టుబడి విలువ రూ.50 లక్షల వరకు పెరుగుతుంది. దీని వల్ల మీరు పొదుపు చేసిన మొత్తంపై అదనపు ఆదాయం వస్తుంది.
4. క్రమశిక్షణ కలిగిన పెట్టుబడి (Disciplined Investment)
SIP పెట్టుబడి విధానం మీకు పొదుపు చేసే అలవాటును కలిగిస్తుంది. ప్రతి నెలా SIP ద్వారా మీరు ఖచ్చితమైన మొత్తాన్ని వెచ్చించడం ద్వారా మీ ఖర్చులను నియంత్రించుకోవచ్చు. ఇది ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే ఇది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే, మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు మదుపు చేయడం కొనసాగించవచ్చు. దీని వల్ల మీరు ఆటంకం లేకుండా పెట్టుబడిని కొనసాగించగలుగుతారు.
5. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు (No Maximum Investment Limit)
SIP ద్వారా మీరు తక్కువ మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, కేవలం రూ.100 లేదా రూ.500తో కూడా SIP మొదలుపెట్టవచ్చు. అలాగే, మీరు అవసరానుసారం మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఒక ప్రయోజనం ఏమిటంటే, మీరు ఒకేసారి బహుళ SIP లను నిర్వహించవచ్చు. అంటే, మీరు విభిన్న మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు SIPను ఉపయోగించుకోవచ్చు. ఇది ఇతర పెట్టుబడి మార్గాల్లో సాధ్యం కాదు.