Director Bobby : ప్రముఖ డైరెక్టర్ బాబీ((Bobby)గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే జోష్ లో ప్రముఖ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna)తో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు సినిమా ప్రమోషన్స్ వేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ డైరెక్టర్ బాబీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సోలో హీరోతో బాబీ హిట్ కొట్టలేడా..?
అసలు విషయంలోకి వెళితే.. బాబీ సినిమా చేయాలి అంటే హీరో క్యారెక్టర్ కి సపోర్ట్ గా ఇంకో హీరో ఉంటేనే హిట్ అవుతుందని, లేకపోతే బాబీ సినిమా బోల్తా కొడుతుంది అనే రేంజ్ లో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి బాబీ సినిమా ప్రతిసారి హిట్ అవడం అనేది ఒక అదృష్టం మాత్రమే అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ఉదాహరణలు కూడా వెల్లడిస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది సంక్రాంతికి చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో విడుదలైన చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా హిట్ అయింది అంటే దానికి కారణం రవితేజ(Raviteja ). రవితేజ లేకుండా ఈ సినిమా అంతటి విజయాన్ని అందుకునేది కాదు అని కూడా కామెంట్లు వ్యక్తమయ్యాయి.
డాకు మహారాజ్ హిట్ అయితే రికార్డ్ మాత్రం ఆయన ఖాతాలోకే..
ఇప్పుడు బాబీ దర్శకత్వం వహిస్తున్న డాకు మహారాజ్ సినిమా ఇన్సైడ్ టాక్ ప్రకారం యావరేజ్ గా ఉందని తెలుస్తోంది. బాలయ్య పాత్రకి బాబీ డియోల్(Bobby Deol) పాత్ర బాగా సపోర్టుగా ఉంటుందట. ఇక బాబి డియోల్ వల్లే సినిమా కొన్నిసార్లు ఒక్కసారిగా లేస్తుందని సమాచారం. ఒకవేళ ఈసారి ఈ సినిమా గనుక హిట్ అయితే, అది కూడా కేవలం బాబి డియోల్ పాత్ర, ఆయన పెర్ఫార్మన్స్ వల్లే అని కూడా అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బాబి సోలో హీరోతో హిట్టు కొట్టలేడని కచ్చితంగా హీరో పాత్రకి మరో సపోర్టింగ్ రోల్ ఉండాల్సిందే అన్నట్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈసారి డాకు మహారాజ్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుంది..? బాబి పై ఎలాంటి ముద్ర పడబోతోంది? అనే విషయాలు కాస్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కానీ మూడవ పాటగా వచ్చిన దబిడి దిబిడే పాట మాత్రం కాస్త విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సినిమా ఐటమ్ సాంగ్ లో ఊర్వసి రవితేజ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అలరించింది కానీ ఆమె డాన్స్ స్పీడ్ ను మ్యాచ్ చేస్తూ బాలయ్య డాన్స్ చేయడంలో విఫలమయ్యారు అని ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ అందించిన శేఖర్ మాస్టర్ పై కూడా నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే లిరికల్ వీడియో ఇప్పుడు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.