Jasprit – Sam Konstas: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంది. గేమ్ కంటే కూడా ప్లేయర్ల మధ్య జరుగుతున్న ఫైట్స్, స్లెడ్జింగ్ లాంటివి హైలెట్ గా నిలుస్తున్నాయి. పెర్త్ టెస్ట్ లో జరిగిన విషయం కాస్త మామూలే అనుకుంటే.. అడిలైడ్ టెస్ట్ లో మాత్రం కాంట్రవర్సీ డోస్ బాగా పెరిగింది. భారత జట్టులో నుంచి విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, బూమ్రా.. ప్రత్యర్ధులతో ఢీ అంటే ఢీ అంటూ హీటెక్కిస్తున్నారు.
Also Read: Nikhat zareen: నన్ను “DSP” అని పిలుస్తూంటే గూస్ బంప్స్ వస్తున్నాయి
ఇక ఆస్ట్రేలియా నుంచి సామ్ కాన్ స్టాస్, లబుషెన్, ట్రావీస్ హెడ్, మిచెల్ స్టార్క్ కూడా వివాదాలకు తెరలేపుతూ మ్యాచ్ లపై మరింత ఇంట్రెస్ట్ ని పెంచుతున్నారు. అయితే సిడ్నీ వేదికగా జరుగుతున్న అయిదవ టెస్ట్ తొలి రోజు కూడా గేమ్ రసవత్తరంగా మారింది. ఇరుజట్ల క్రికెటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. గేమ్ ముగిసే సమయంలో ఆఖరి బంతికి చోటు చేసుకున్న పరిణామం భారత క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఈ సిడ్నీ టెస్ట్ లో రోహిత్ శర్మ స్థానంలో బూమ్రా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
అయితే టాస్ గెలిచిన భారత సారధి బూమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ భారీ స్కోరు చేయడంలో భారత జట్టు విఫలమైంది. 72.2 ఓవర్లలో కేవలం 185 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో తొలిరోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ బ్యాటర్లకు షాక్ తగిలింది. శుక్రవారం రోజు ఆట పూర్తయ్యేసరికి 3 ఓవర్లలో ఓ వికెట్ నష్టానికి 9 పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది.
ఆఖరి బంతి పడడానికి ముందు ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ కాస్త ఓవరాక్షన్ చేశాడు. భారత జట్టు పేసుగుర్రం బూమ్రాతో వాదులాటకు దిగాడు. చివరి బంతి వేయడానికి బూమ్రా ముందుకు కదులుతున్న సమయంలో క్రేజ్ లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమనట్లు సైగ చేశాడు. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేశాడు భారత బౌలర్ బూమ్రా. ఈ క్రమంలో నాన్ – స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న సామ్ కాన్ స్టాస్ బూమ్రాను చూస్తూ ఏదో అన్నాడు.
దీంతో బూమ్రా వెంటనే సీరియస్ అయ్యాడు. నీ ప్రాబ్లం ఏంటి..? అన్నట్లుగా ముందుకి వెళ్ళాడు. దీంతో వెంటనే కలగజేసుకొని ఎంపైర్ ఇద్దరినీ కూల్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ వీరి వివాదాన్ని నిశితంగా గమనించాడు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత తన అద్భుతమైన బంతితో క్రేజ్ లో ఉన్న ఉస్మాన్ ఖవాజా (2) నీ పెవిలియన్ చేర్చాడు. బూమ్రా వేసిన బంతి ఖవాజా బ్యాట్ ని తాకి స్లిప్ లో ఉన్న కేఎల్ రాహుల్ చేతికి చిక్కింది.
Also Read: Champions Trophy 2025: రోహిత్ కు దెబ్బ మీద దెబ్బ.. వన్డే కెప్టెన్సీ కూడా గల్లంతు !
దీంతో ఒక్కసారిగా భారత ఆటగాళ్లంతా కాన్ స్టాస్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి అతడు భయపడేలా సెలబ్రేట్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ ఇంకాస్త అగ్రెసివ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి అతడి పక్కన సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక ఈ వికెట్ పడగానే ఆట ముగిసింది. దీంతో వీరి వివాదం, ఆ వికెట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు బూమ్రాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
THIS IS TEST CRICKET. 🫡
THIS IS BGT. 🍿
THIS IS CAPTAIN JASPRIT JASBIR SINGH BUMRAH. 🥶pic.twitter.com/eUJXyb1NSO
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2025
Inject.🔥🥶
Konstas surely got scared at non-striker end bc.😭🤣#INDvsAUS pic.twitter.com/i3tl5V5BHp
— Utkarsh (@toxify_x18) January 3, 2025