BigTV English

Project K: ‘న భూతో న భవిష్యతి’.. ‘ప్రాజెక్ట్‌-కె’ గురించి నిర్మాత క్లారిటీ.. మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..

Project K: ‘న భూతో న భవిష్యతి’.. ‘ప్రాజెక్ట్‌-కె’ గురించి నిర్మాత క్లారిటీ.. మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్..

Project K: ప్రాజెక్ట్-కె. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ. ప్రభాస్ రేంజ్‌ను మరింత హైలైట్ చేసే సినిమా. నాగ్ అశ్విన్ పక్కా లెక్కలతో తీస్తున్న చిత్రం. దీపిక పదుకుణె, అమితాబ్ లాంటి అగ్ర తారాగణం. లేటెస్ట్‌గా ప్రాజెక్ట్ కె గురించి పలు అప్‌డేట్స్ ఇచ్చారు నిర్మాత అశ్వనీదత్.


‘ప్రాజెక్ట్‌-కె’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మిక్కీ జె మేయర్‌. ఇప్పుడాయన్ను మార్చేశారు. తమిళంలో సూపర్‌హిట్లు కొడుతున్న సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా వచ్చారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడంలో సంతోష్ ఫుల్ ఎక్స్‌పర్ట్. రజనీకాంత్ కబాలీ మూవీ బీజీఎం ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఆయన వర్క్ చూసే మిక్కీ జె మేయర్ స్థానంలో సంతోష్ నారాయణన్‌ను తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రాజెక్ట్ కె గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అశ్వనీదత్. ‘ప్రాజెక్ట్‌-కె’ మెయిన్‌గా సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ అయినా కూడా ఇందులో ఎమోషన్స్‌, సెంటిమెంట్‌ కూడా ఉంటాయని అన్నారు.


హీరో ఓరియెంటెడ్ సినిమానే అయినా.. ప్రభాస్‌తో పాటు దీపిక, అమితాబ్‌ల స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. చాలా సన్నివేశాల్లో ఆ ముగ్గురూ కలిసి కనిపిస్తారని అన్నారు.

‘ప్రాజెక్ట్‌-కె’ షూటింగ్ ఎంత వరకు పూర్తి అయిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ గోల పెడుతున్నారు. దీనిపైనా క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత. ఇప్పటివరకూ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయినట్టు తెలిపారు.

‘ప్రాజెక్ట్‌-కె’కు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఐదారు కంపెనీలు చేస్తున్నాయని చెప్పారు. ఆ గ్రాఫిక్ వర్క్‌ను సినిమాలో చూసినప్పుడు ‘న భూతో న భవిష్యతి’ అనిపించేలా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులు ఇప్పటివరకూ చెందని సరికొత్త అనుభూతిని ‘ప్రాజెక్ట్‌-కె’ ఇస్తుందని నిర్మాత అశ్వనీదత్ చెప్పారు.

ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని స్టోరీతో.. అత్యాధునిక హంగులతో.. భారీ గ్రాఫిక్ వర్క్స్‌తో.. ‘ప్రాజెక్ట్‌-కె’ను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న project k రిలీజ్ కానుంది. మూవీ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×