Lavanya Tripathi:ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఇప్పుడు మెగా కోడలిగా అవతరించిన తర్వాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి తోడు త్వరలో పండంటి వారసుడినో లేదా వారసురాలినో మెగా కుటుంబానికి అందించబోతోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ప్రెగ్నెన్సీ క్షణాలను ఎంజాయ్ చేస్తూ.. భర్తతో కలిసి సరదాగా కాలక్షేపాన్ని గడుపుతోంది.
ఇకపోతే ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా సొట్టబుగ్గల సుందరిగా పేరు సొంతం చేసుకున్న లావణ్య త్రిపాఠి.. ఇందులో అమాయకత్వపు చూపులు అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతలా తన లుక్ తో అందరినీ ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి కి ఆ తర్వాత వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తో పీకల్లోతు ప్రేమలో పడి, గత ఏడాది వివాహం కూడా చేసుకుంది.
అందాల రాక్షసి రీ రిలీజ్ ప్రమోషన్స్ లో లావణ్య..
ఇకపోతే వివాహం తర్వాత ‘సతీ లీలావతి’ అనే సినిమాలో నటిస్తోంది. కానీ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా ఈ మూవీ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు ఈమె నటించిన ‘అందాల రాక్షసి’ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది లావణ్య త్రిపాఠి. అందులో భాగంగానే ఈ చిత్ర హీరో రాహుల్ రవీంద్రన్ తో కలిసి తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కి.. యాంకర్ ఒక వీడియో చూపించారు.
13 ఏళ్ల క్రితమే చిరు నా పెళ్ళికి వచ్చారు – లావణ్య త్రిపాఠి
అందాల రాక్షసి సినిమాలో..” మిథున అక్క మీ పెళ్లికి చిరంజీవి కూడా వస్తాడా?” అని ఓ చిన్నారి అడిగినప్పుడు.. దానికి లావణ్య “అవును” అన్నట్లు తల ఊపుతుంది.. ఈ సీన్ ఉన్న వీడియోని చూపిస్తూ.. ఒక నెటిజన్ నిజంగానే మీ పెళ్లికి చిరంజీవి వచ్చాడు అని కామెంట్ చేశారు అని చెప్పగా.. దానికి లావణ్య ..”అవును అది పర్ఫెక్ట్ టైమింగ్ లో ఆ సీన్ జరిగింది. అదే నిజమైంది. 13 ఏళ్ల క్రితమే చిరంజీవి నా పెళ్ళికి వచ్చారు” అంటూ ఫన్నీగా నవ్వుతూ కామెంట్లు చేసింది లావణ్య. ఇక ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే నాడు సరదాగా చేసిన సీన్.. తన జీవితంలో నిజంగా జరిగింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
అందాల రాక్షసి సినిమా విశేషాలు..
హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో నవీన్ చంద్ర(Naveen Chandra), రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran), లావణ్య త్రిపాఠి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అందాల రాక్షసి’. 2012 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, ఎస్ఎస్ రాజమౌళి వారాహి చలనచిత్ర పతాకం పై నిర్మించారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ప్యూర్ లవ్ స్టోరీ మూవీ గా నిలిచిపోయింది. ఇప్పుడు రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.