OTT Movie : ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 2003 లో వచ్చిన కొరియన్ క్లాసిక్ మూవీ ‘Memories of Murder’ నుండి స్ఫూర్తి పొందింది. ఇది ముంబైలో జరిగే ఒక సీరియల్ కిల్లర్ కథ చుట్టూ తిరుగుతుంది. అతను మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి కాళ్లను కత్తిరించి, శవాలను ఎర్రటి సూట్‌కేస్‌లో వదిలేస్తాడు. ఈ కేసును ఒక CBI అధికారి విచారణతో ముందుకు వెళ్తుంది. అతను ఈ హంతకుడిని పట్టుకోవడానికి తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటాడు. చివరికి హంతకుడిని CBI అధికారి పట్టుకుంటాడా ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
సినిమా ముంబైలో ఒక యువతి రైల్వే ట్రాక్ సమీపంలో కిరాతకంగా హత్య చేయబడటంతో ప్రారంభమవుతుంది. ఆమె శవం ఒక ఎర్రటి సూట్‌కేస్‌లో కనిపిస్తుంది. ఆమె కాళ్లు కత్తిరించబడి ఉంటాయి. ఈ హత్యలు పోలీసుయకు దొరక్కుండా, ఒక సీరియల్ కిల్లర్ చేస్తుంటాడు. అతను “Footfairy” అని పిలువబడతాడు. ఎందుకంటే అతను తన బాధితుల కాళ్లపై ఫెటిష్ కలిగి ఉంటాడు. CBI అధికారి వివాన్ దేశ్‌ముఖ్ (గుల్షన్ దేవయ్య) ఈ కేసును విచారించడానికి నియమించబడతాడు. వివాన్ తన సహచరుడు హర్ష్ (అశిష్ పథోడ్)తో కలిసి, ఈ హంతకుడిని పట్టుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. ఎందుకంటే హంతకుడు ఆధారాలను చాలా తెలివిగా దాచిపెడతాడు. వివాన్ ఒక పీడియాట్రిషియన్ అయిన దేవికను కలుస్తాడు. ఆమె సైకోపాథీ గురించి జ్ఞానం కలిగి ఉంటుంది. దేవిక వివాన్‌కుఈ కేసు గురించి కొన్ని సూచనలను అందిస్తుంది.
కేసు విచారణ సమయంలో, పోలీసులు ఒక రెస్టారెంట్ యజమాని జోషువా మాథ్యూస్ (కునాల్ రాయ్ కపూర్)ను అనుమానిస్తారు. అతనికి కాళ్లపై ఫెటిష్ ఉంది. హింసాత్మక ధోరణుల చరిత్ర ఉంది. వివాన్, జోషువాను హంతకుడిగా భావిస్తాడు, కానీ ఆధారాలు అతన్ని నేరస్థుడిగా నిరూపించడానికి అంతగా సరిపోవు. ఈ సారి వివాన్ ఒక పథకం రూపొందిస్తాడు. ఒక మహిళను రైల్వే ట్రాక్‌ల వద్ద ఎర వేసి, హంతకుడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రణాళిక విఫలమవుతుంది. ఒక సమయంలో ఒక సందీప్ అనే సాక్షి, హంతకుడిని చూశానని చెప్పినప్పటికీ ఆధారాలు స్పష్టంగా ఉండవు.
ఇక వివాన్ కి కేసులో ఒత్తిడి పెరిగేకొద్దీ, జోషువా ఇంటిపై దాడి చేసి, అతన్ని కొట్టి నేరం అంగీకరించమని ఒత్తిడి చేస్తాడు. జోషువా ఒత్తిడిలో నేరాన్ని అంగీకరిస్తాడు. కానీ DNA ఫలితాలు అతనికి వ్యతిరేకంగా వస్తాయి. అతను హంతకుడు కాదని నిరూపిస్తాయి. ఈ ఘటన తర్వాత, జోషువా వివాన్‌పై అవమానకరమైన కేసు ఫైల్ చేస్తాడు. చివరకి వివాన్ హంతకుడిని పట్టుకుంటాడా ? నేరస్థుడు మహిళల కాళ్ళను ఎందుకు కట్ చేస్తున్నాడు ? దీని వెనుక అసలు కారణం ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : లాటరీలో కారు తగిలితే డిక్కీలో శవం వచ్చింది … ఓటీటీలో అదరగొడుతున్న బ్లాక్ కామెడీ థ్రిల్లర్
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫూట్ ఫెయిరీ’ (Footfairy). దీనికి కనిష్క్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో గుల్షన్ దేవయ్య (వివాన్ దేశ్‌ముఖ్), సాగరికా ఘట్గే (దేవిక), కునాల్ రాయ్ కపూర్ (జోషువా), ముస్కాన్ బమ్నే, అశిష్ పథోడ్, షమల్ రోకడే వంటి నటులు నటించారు.నెట్‌ఫ్లిక్స్(Netflix) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.