Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఈమె తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందాల రాక్షసి(Andala Rakshasi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)మొదటి సినిమాతోనే తన నటనతో మంచి సక్సెస్ అందుకొని తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.. ఇలా తెలుగు సినిమాలలో నటిస్తున్న ఈమె చివరికి తెలుగు ఇంటి కోడలు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) తో కలిసి రెండు సినిమాలలో నటించారు అయితే ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆపరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది.
తల్లి కాబోతున్న నటి…
మెగా హీరోతో ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠి తన ప్రేమ విషయాన్ని ఎక్కడ బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇక వీరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడ స్పందించలేదు. ఇలా ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతూ ఏకంగా నిశ్చితార్థం తేదీని ప్రకటించారు. అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో ఈ జంట ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వకుండా దూరంగా ఉన్నారు అయితే ఇటీవల ఈమె అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
మౌనంగా ఉంటాను…
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ త్వరలోనే తమ బిడ్డకు స్వాగతం పలకబోతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన లావణ్య త్రిపాఠి తాజాగా అందాల రాక్షసి సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుణ్ తేజ్ తో మీకు గొడవ జరిగితే ఏం చేస్తారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు లావణ్య సమాధానం చెబుతూ… వరుణ్ తేజ్ నాకు ఏదైనా గొడవ జరిగితే తను ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నేను అసలు మాట్లాడనని సైలెంట్ అవుతానని లావణ్య త్రిపాఠి తెలియ చేశారు.
అమ్మల బుజ్జగిస్తాడు…
ఇలా తనతో గొడవ పడటం, అలాగే ఇద్దరం ఆ విషయం గురించి ఆర్గ్యూ చేసుకోవడం నాకు నచ్చదని, అప్పటికి నేను సైలెంట్ అవుతాను ఇక చివరికి ఆ గొడవ గురించి మర్చిపోయి ఇద్దరం ఎప్పటిలాగే ఉంటాము అంటూ లావణ్య తెలిపారు. ఇలా ఉండటం వల్ల విడాకులు అనేవి జరగవని, చాలామంది చిన్న చిన్న విషయాలకి గొడవపడి విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ లావణ్య త్రిపాఠి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తన లైఫ్ చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఒకప్పుడు చాలా ఒంటరిగా అనిపించేది కానీ వరుణ్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని తను నన్ను చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటాడని, ఒక అమ్మలా నన్ను బుజ్జగిస్తూ ఉంటాడు అంటూ తన వైవాహిక జీవితం గురించి లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.