BigTV English
Advertisement

Ahmedabad air crash: విమానం క్రాష్ రహస్యాలు? అహ్మదాబాద్ లో అసలేం జరిగింది?

Ahmedabad air crash: విమానం క్రాష్ రహస్యాలు? అహ్మదాబాద్ లో అసలేం జరిగింది?

Ahmedabad air crash: ఆహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ ఇండియా AI-171 విమానం లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. పెద్దవారి నుంచి చిన్నారుల వరకు ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. కొందరికి ఇది మొదటి అంతర్జాతీయ ప్రయాణం. కానీ వారి కలలు క్షణాల్లో బూడిద అయ్యాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రాడార్ నుండి మాయమైంది. ఆ తర్వాత మేఘానీనగర్‌లో ఘోర విమాన ప్రమాదంగా మారింది.


ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది. మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు చెవులు మూసుకుని, గుండెలవిసేలా అగ్నిజ్వాలలు చూశారు. అందిన సమాచారం ప్రకారం, విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంకా అధికారికంగా మరణాలు, గాయాల వివరాలు వెల్లడించలేదు కానీ ఘటన తీవ్రత చూస్తే, ఇది దేశంలోని ప్రమాదకరమైన విమాన బీభత్సాలలో ఒకటిగా భావించవచ్చు.

క్రాష్ ఎలా జరుగుతుందంటే?
ఈ ఘటనతో మరోసారి ఒక ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది.. విమానాలు ఎందుకు క్రాష్ అవుతాయి?. ప్రతిరోజూ వందలాది విమానాలు నిశ్శబ్దంగా గగనాన్ని చీల్చుకుంటూ ప్రయాణిస్తే, కొన్ని మాత్రమే ఇలా ప్రమాదానికి గురవుతాయి. అయితే ఒకసారి జరిగిన వెంటనే ఎందుకు?, ఎలా? అన్న ప్రశ్నలకు జవాబు అవసరం.


విమాన ప్రమాదాలు సాధారణంగా మూడు దశల్లో జరుగుతాయి.. అవేమిటంటే టేకాఫ్, క్రూజ్ , ల్యాండింగ్. ఈరోజు జరిగిన ఈ ప్రమాదం టేకాఫ్ తర్వాత తక్కువ సమయంలోనే జరిగినందున, ఇంజిన్ ఫెయిల్యూర్, బర్డ్ హిట్, నావిగేషన్ లోపం వంటి అనేక కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

బ్లాక్ బాక్స్ కీలకం..
ప్రమాదాన్ని ఎదుర్కొన్న చోట బ్లాక్‌బాక్స్ (Flight Data Recorder) ప్రస్తుతం స్వాధీనం చేసుకొని, AAIB (Aircraft Accident Investigation Bureau) దీనిపై లోతైన విశ్లేషణ ప్రారంభించింది. ఈ బ్లాక్‌బాక్స్ ద్వారా పైలట్ చివరి సంభాషణలు, విమాన శరీర స్థితి, ఇంజిన్ పనితీరు తదితర సమాచారం బయటపడుతుంది. దీనిద్వారా అసలు ప్రమాదానికి గల కారణాలు స్పష్టమవుతాయి.

ఇలాంటి ప్రమాదాల్లో మరో ముఖ్యమైన అంశం మానవ తప్పిదం. విమానాన్ని నడిపే పైలట్‌లు ఎంత శిక్షణ పొందినా, ఒక్క చిన్న తప్పు కూడా ఘోర ఫలితాలివ్వగలదు. టేకాఫ్ సమయంలో స్పీడ్ సరిగ్గా లేకపోవడం, లేదా నావిగేషన్ లోపం వల్ల రన్‌వే చివర రాకముందే ఎత్తు కోల్పోవడం వంటి ఉదాహరణలు గతంలో ఎన్నో ఉన్నాయి.

ఇలాంటి ప్రమాదాలు కూడా..
కేవలం సాంకేతిక లోపాలు లేదా పైలట్ తప్పిదాలే కాకుండా, కొన్ని సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు కూడా భయంకర పాత్ర పోషిస్తాయి. తుఫానులు, పొగమంచు, వేగవంతమైన గాలులు విమానాన్ని ట్రాక్‌కి దూరం చేసి కూల్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఈ రోజు కూడా వాతావరణం ప్రభావం ఉన్నదా అన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

విమానం ప్రమాదాల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలోనే జరుగుతాయి. ప్రయాణ దశ (Cruise Phase)లో ప్రమాదాలు చాలా తక్కువ. కానీ టేకాఫ్ సమయంలో ఒక్క సెకన్ల వ్యవధిలో జరిగే నిర్ణయాలే ప్రమాదాల్ని పునరావృతం చేస్తుంటాయి.

Also Read: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. గుండె బరువెక్కించే చిత్రాలు!

ఈ ప్రమాదంతో ప్రజల్లో విమాన ప్రయాణ భద్రతపై భయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ గణాంకాల ప్రకారం విమానాలు అనునిత్యం అత్యంత భద్రతతో నడిచే రవాణా మార్గాల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. 1 మిలియన్ ఫ్లైట్స్‌కు ఒక క్రాష్ మాత్రమే జరుగుతుంది. అయితే మనిషి ప్రాణం విలువైనదైనప్పుడు ఒక్క క్రాష్ కూడా మనకు మచ్చే.

విశ్లేషకుల మాట ఇదే..
ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం, విమానయాన సంస్థలు, టెక్నికల్ బృందాలు కలసి ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి, భవిష్యత్తులో అటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. బ్లాక్ బాక్స్ నివేదిక త్వరగా విడుదల చేసి ప్రజలకు నిజం తెలియజేయాలి. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, కేవలం విచారణలు సరిపోవు. విమానయాన రంగంలో ప్రతీ నియమం, శిక్షణ, పరీక్షలు మరింత గట్టి చేయాలి. ప్రయాణికుల ప్రాణాలు గగనంలో కాదు, ప్రభుత్వ భద్రతా పాలసీలలో ఉండాలి.

Related News

IRCTC Packages: రామేశ్వరం నుంచి అయోధ్య వరకు.. భారత గౌరవ్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర

Shocking Video: ఎక్కువ ధర ఎందుకన్న ప్రయాణీకుడు, చితక బాదిన క్యాటరింగ్ సిబ్బంది, వీడియో వైరల్!

Vande Bharat Trains: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?

Nashik Tour: నాసిక్ టూర్.. ఈ ప్లేస్‌లు జీవితంలో ఒక్కసారైనా చూడాలి మావా !

Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల నుంచి 60 ప్రత్యేక రైళ్లు!

Bangalore Tour: బెంగళూరు టూర్.. ఈ ప్రదేశాలు ఒక్కసారైనా చూడాల్సిందే !

Amazon Pay Offers: రూ.3వేలలోపే గోవా ట్రిప్, బుకింగ్‌లు స్టార్ట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు..

Vande Bharat: ఇక ఆ వందే భారత్ రైలు నరసాపురం వరకు పొడిగింపు, ప్రయాణికులకు పండగే!

Big Stories

×