BigTV English

Anushka Shetty: ‘ఖైదీ’ సీక్వెల్‌లో స్వీటి.. LCUలోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి

Anushka Shetty: ‘ఖైదీ’ సీక్వెల్‌లో స్వీటి.. LCUలోకి అడుగుపెట్టిన అనుష్క శెట్టి

Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి సూపర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే సూపర్ అనిపించుకున్నారు నటి అనుష్క(Anushka). మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం విభిన్నమైన సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కెరియర్ మొదట్లో ఏ హీరోయిన్ కూడా చేయని సాహసాన్ని ఈమె చేస్తూ అరుంధతి వంటి సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటిగా తెలుగు, తమిళ భాష చిత్రాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క  “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అందుకున్నారు.


ఈ సినిమా తర్వాత అనుష్క కెరియర్ పరంగా బిజీ అవుతుందనుకున్న తరుణంలో ఈమె ఒక్కసారిగా ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ అవ్వకుండా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కేవలం తన వ్యక్తిగత విషయాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క తిరిగి వరుస సినిమాల ద్వారా కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు తమిళ మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అనుష్కకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అనుష్క ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్ లోకి అడుగుపెట్టారని తెలుస్తోంది.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..


డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ఒక ప్రపంచాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈయన తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో(Lokesh Cinematic Universe) ఎంతోమంది నటీనటులను భాగం చేస్తున్నారు. ఇకపోతే తాజాగా నటి అనుష్క శెట్టి కూడా ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది. ఈమె కార్తీ(Karthi) హీరోగా ఖైదీ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్న ఖైదీ 2 సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం లోకేష్ కూలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఖైదీ 2 షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

లేడీ డాన్…

ఇక ఈ సినిమాలో నటి అనుష్క శెట్టి కీలకపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనుష్క ఒక లేడీ డాన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇలా డాన్ పాత్రలలో అనుష్క నటించిన విషయం తెలిసిందే. బిల్లా సినిమాలో ఇదే తరహా పాత్రలో నటించారు. ఇప్పుడు కార్తీ సినిమాలో కూడా ఈమె నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తన కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పాలి. అయితే ఇదివరకు కార్తీ అనుష్క కాంబినేషన్లో అలెక్స్ పాండియన్ అనే సినిమా 2013 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తిరిగి మరోసారి ఈ జంట ఖైది 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమా అనుష్కకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×