Laya: స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది లయ. అచ్చతెలుగు అందం అయిన ఆమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. గ్లామర్ ను చూపించకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని లయ సినిమాలకు దూరమైంది.
భర్తతో కలిసి విదేశాల్లో సెటిల్ అయిన లయ.. అసలు ఎక్కడుంది.. ? ఏం చేస్తుంది.. ? అనే విషయం ఎవరికీ తెలియలేదు. దీంతో చాలామంది ఆమెపై లేనిపోని పుకార్లు పుట్టించారు. డబ్బులు లేక విదేశాల్లో ఇబ్బందులు పడుతుందని.. భర్తతో కలిసి ఉండడం లేదని ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇండియాకు ఎప్పుడు రానీ లయ.. వీటిపై ఎప్పుడు స్పందించలేదు. ఇక ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా గుర్తింపు తెచ్చుకుందో ఎంత దూరంలో ఉన్నవారైనా అభిమానుల ముందు ఇట్టే ప్రత్యేక్షమవుతున్నారు. అలానే లయ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులను మరోసారి పలకరించింది. నిత్యం వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చింది.
ఇక లయను చూసినవారందరూ రీఎంట్రీ ఇవ్వాలని కోరారు. అంతకు ముందే లయ.. తన కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేసింది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా నటించిన చిన్నారి లయ కూతురు. అప్పట్లో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా హిట్ అయితే ఆమె కూడా హీరోయిన్ గా మారేది అని చెప్పొచ్చు. కాకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపాయింది. ఇక డ్యాన్స్ విడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లయకు టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది.
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు లయనే హైలైట్. జూలై 4 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరవ్వడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని మొత్తం బయటపెట్టింది.
తానేమి విదేశాల్లో డబ్బులు లేక ఇబ్బంది పడడం లేదని, తనకంటూ ఒక డ్యాన్స్ స్కూల్ ఉందని, తన భర్త పిల్లలతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఒకసారి బాలకృష్ణగారితో నటించే ఛాన్స్ వస్తే ఏడ్చినట్లువినాయక్ తెలిపాడు. అందుకు కారణం.. బాలయ్య పక్కన హీరోయిన్ గా కాకుండా చెల్లెలి పాత్రకు నన్ను అడిగినట్లు ఆమె తెలిపింది. బాలయ్య కెరీర్ లో గుర్తుండే సినిమాల్లో చెన్నకేశవరెడ్డి ఒకటి.
వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల బంధం హైలైట్ అని చెప్పాలి. అన్న ప్రాణాల మీదకి వస్తే సొంత భర్తను కూడా చంపేయమనే చెల్లి.. అలాంటి పౌరుషం ఉన్న పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో లయ అయితే బావుంటుందని వినాయక్.. ఆమెను సంప్రదించాడట. కథ చెప్పగానే లయ ఏడ్చేసి.. ఏంటి నాకు చెల్లెలి పాత్రలు చేసే వయస్సు వచ్చిందా అని అడిగినట్లు వినాయక్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ ఇంటర్వ్యూలో ఆమె దీనికి సమాధానం చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ఏం జరిగింది అనేది తనకు గుర్తులేదని, ఫీల్ అయ్యి ఉంటానేమో కానీ అంతగా ఏడవలేదు అని చెప్పుకొచ్చింది. చెన్నకేశవరెడ్డి మిస్ అయినా విజయేంద్రవర్మ సినిమాలో ఆయనతో రొమాన్స్ చేసినట్లు ఆమె తెలిపింది.