BigTV English

Wife Kill Kids: ఊరెళ్లిన భర్త.. లవర్‌తో హనీమూన్ వెళ్లేందుకు 2 పిల్లలను చంపిన భార్య

Wife Kill Kids: ఊరెళ్లిన భర్త.. లవర్‌తో హనీమూన్ వెళ్లేందుకు 2 పిల్లలను చంపిన భార్య

Wife Kill Kids For Lover| వివాహేతర సంబంధాల కారణంగా దంపతుల జీవితాలే కాదు.. వారి అమాయక పిల్లల జీవితాలు కూడా బలి అవుతాయి. ఇలాంటి ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. భర్త, పిల్లలుండగా.. ఒక యువతి మరో యువకుడిని ప్రేమించింది. అతడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న పిల్లలను హత్య చేసింది. ఆ తరువాత తనకేమీ తెలియనట్లు నాటకమాడింది. కానీ చివరికి పోలీసుల విచారణలో ఆమె నిజం బయటపడింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లా రోడ్ కలీ గ్రామానికి చెందిన వసీమ్ అనే 30 ఏళ్ల యువకుడికి 7 ఏళ్ల క్రితమ వివాహం జరిగింది. కానీ ఏడాది లోపే అతని భార్య గొడవలు పడి విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తరువాత వసీమ్ దూరపు బంధువుల అమ్మాయి అయిన ముస్కాన్‌ని(24) రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ అర్హాన్ (5), ఇనాయా (1) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వెల్డింగ్ పనులు చేసి జీవనం సాగించే వసీం కుటుంబం పెరగడం ఆర్థిక అవసరాల కోసం ఢిల్లీ, చండీగడ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్లి వెల్డింగ్ పనులు చేసేవాడు.

వసీమ్, ముస్కాన్ ల కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలో వసీమ్ తరుచూ ఇంటి నుంచి దూరంగా ఉంటున్న సమయంలో ముస్కాన్ అదే గ్రామానికి చెందిన మరో యువకుడు జునైద్ పై మనసు పడింది. జునైద్ అదే గ్రామంలో వ్యవసాయ కూలీ చేసుకుంటున్నాడు. ముస్కాన్ కూతురు ఇనాయా పుట్టకముందు నుంచీ వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం వసీంకు తెలిసి అతను భార్యను జునైద్ కు దూరంగా ఉండాలని హెచ్చిరించాడు కూడా. కానీ ముస్కాన్ మాత్రం భర్తను వదిలేసి ఒకసారి ఇంటి నుంచి పారిపోయింది.


వసీమ్ ఆమెకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నించగా.. బంధువులంతా కలిసి పంచాయితీ చేసి ముస్కాన్ కు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి భార్య భర్తల మధ్య రాజీ కుదర్చారు. అలా ముస్కాన్ తిరిగి భర్త వద్దకు చేరినా.. ఆమెకు మరో కూతురు పుట్టిన తరువాత మళ్లీ జునైద్ ని కలుస్తూ ఉండేది. వసీమ్ ఇంట్లో లేని సమయంలో జునైద్ తరుచూ ఇంటికి వచ్చి ముస్కాన్ తో సమయం గడిపేవాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వసీమ్ ఇంట్లో లేని సమయంలో అతడి పిల్లలిద్దరూ జీవం లేని స్థితిలో కనిపించారు. తన పిల్లలిద్దరికీ ఏమైందో నని వారి తల్లి ముస్కాన్ రోదిస్తూ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వసీమ్ వెంటనే తన తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆయన ఇంటికొచ్చి.. చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరు పిల్లలు మరణించారని వారిపై విష ప్రయోగం జరిగినట్లు ఉందని అనుమానించి పోలీసులకు ఫోన్ చేశాడు.

పోలీసులు ఇంటికి చేరుకొని పిల్లల మృతదేహాలను పోస్ట్ మార్టం చేసేందుకు తరలించారు. కానీ ముస్కాన్ అందుకోసం అడ్డుపడింది. దీంతో పోలీసులు ఆమెపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత విచారణ కోసం ముస్కాన్ ఫోన్ కావాలని అడిగారు. కానీ తన ఫోన్ కనిపించడం లేదని ఎక్కడో పోగొట్టుకున్నానని బుకాయించింది. ఆమె మాటలతో అనుమానం కలిగిన పోలీసులు ఆమె గురించి ఆరా తీయగా ఆమె అక్రమ సంబంధం, ఆమె ప్రియుడు జునైద్ గురించి తెలిసింది. దీంతో పోలీసులు ముస్కాన్ ని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడామె ఒత్తిడి కారణంగా నిజం చెప్పేసింది. అది విని పోలీసులు షాక్ కు గురయ్యారు.

Also Read: కాబోయే కోడలితో మామ జంప్.. ఆరుగురు పిల్లల తండ్రిపై మనసు పడ్డ యువతి

పిల్లలను చంపడానికి జునైద్ విషం, రసగుల్లా స్వీట్స్ తీసుకొచ్చాడు. పిల్లలిద్దరికీ వారి తల్లి ముస్కాన్ ఆ స్వీట్స్ లో విషం కలిపి తినిపించింది. దీంతో పిల్లలు అవి తిని నిద్రపోయారు. ఆ తరువాత నిద్రలేవలేదు. మధ్యాహ్నం పిల్లలు చనిపోయారని ధృవీకరించుకొని ముస్కాన్ ఏడుస్తూ నాటకం మొదలు పెట్టింది. పోలీసులు ఇదంతా తెలుసుకొని జునైద్ కోసం అరెస్టు చేయాలని వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Related News

Kolkata Crime: బర్త్ డే చేస్తామని పిలిచి.. డోర్ లాక్ చేసి.. కోల్ కతాలో యువతిపై..

UP News: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై డెలివరీ, బేబీ పుట్టిన గంటకే

Meerut News: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. ఉత్తరాదిలో ఆగడాలు.. టార్గెట్ మహిళలు-అమ్మాయిలే

Delhi News: రూటు మార్చిన దొంగలు.. ఎర్రకోటలో భారీ చోరీ, బంగారు కలశాలు మాయం!

Attack On Law Student: కారులో బంధించి 60 చెంపదెబ్బలు.. వామ్మో, ఇలా కూడా కొడతారా? ఇదిగో వీడియో

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

Big Stories

×