BigTV English

LENIN Movie : హీరోనే గుర్తుపట్టడం లేదు… అయ్యగారికి ఇదెక్కడి సమస్యరా నాయనా…?

LENIN Movie : హీరోనే గుర్తుపట్టడం లేదు… అయ్యగారికి ఇదెక్కడి సమస్యరా నాయనా…?

LENIN Movie : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కినేని నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అఖిల్. అయితే ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ అతనికి ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందివ్వ లేకపోయింది. దాంతో ప్రస్తుతం కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో నెట్టింట ట్రోల్స్ అందుకుంటుంది. అఖిల్ లుక్ పై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.


లెనిన్ గ్లింప్స్..

అఖిల్  తన ఆరో సినిమాగా లెనిన్ చేస్తున్నాడు. వినరో భాగ్యం విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.. నిన్న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తే.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు అర్ధమైంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ సినిమాకే హైలెట్ అవ్వనున్నాయని వీడియోను చూస్తే అర్థమవుతుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే విధంగా ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.


అఖిల్ లుక్ పై ట్రోల్స్..

అక్కినేని అఖిల్ గతంలో నటించిన సినిమాల్లో స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు వస్తున్న లెనిన్ మూవీలో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. గ్లింప్స్ వీడియో ఆకట్టుకున్న కూడా లుక్ పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. దగ్గరగా చూస్తే తప్ప అందులో ఉన్నది అఖిల కాదా అన్నది చాలామంది కన్యుఫ్యూజ్అవుతారు.. సడెన్ గా చూస్తే గడ్డంతో ఉన్న నితిన్ అని అనుకుంటారు. కొందరు బాలీవుడ్ హీరోలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అఖిల్ గ్లింప్స్ వీడియో ట్రెండ్ అవుతుంది. కానీ లుక్ పై మాత్రం కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read :పేడకల్లు ఎత్తుకుంటూ డబ్బుల కోసం కష్టాలు.. గుండెల్ని పిండేస్తున్న కల్పలత కథ..

స్టోరీ విషయానికొస్తే..

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో పూర్తి స్థాయి యాక్షన్ ప్యాక్డ్ సినిమాగా తెరకెక్కుతున్నది. పురాణాల బ్యాక్ డ్రాప్‌తో అధ్యాత్మిక అంశాలు జొప్పించిన చిత్రంగా గ్లింప్స్ కనిపించింది. ఈ సినిమాకు లెనిన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టడంతో పాజిటివ్ వైబ్ కనిపించింది.. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీతో సరికొత్త రికార్డు ను బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. మరి అఖిల్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.. ఈ మూవీ పై ఆశలు పెట్టుకున్నాడు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×