BigTV English

Yuzi Chahal With Mahvash : విడాకులైన నెల రోజులకే లవర్ తో సెల్ఫీ… చాహల్ సంచలన పోస్ట్

Yuzi Chahal With Mahvash : విడాకులైన నెల రోజులకే లవర్ తో సెల్ఫీ… చాహల్ సంచలన పోస్ట్

Yuzi Chahal With Mahvash : ప్రముఖ క్రికెటర్ యుజేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయన టీ-20లో అద్భుతమైన బౌలింగ్ వేస్తూ అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం అతను పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఈయన ధన శ్రీని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ధనశ్రీ విడాకుల తరువాత చాహల్ కేవలం నెల రోజుల వ్యవధిలోనే తన లవర్ తో సెల్ఫీ దిగినట్టు సమాచారం.


ప్రముఖ యూట్యూబర్ ఆర్జే మహ్ వష్ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. వరుస ఐపీఎల్ మ్యాచ్ లలో కనిపించి తెగ సందడి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోపీ తరువాత ఈమె పేరు మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే పంజాబ్ లోని ఛండిఘర్ లో జరిగిన మ్యాచ్ లో కూడా మెరిసింది. ఏకంగా క్రికెటర్ యుజేంద్ర చాహల్ తో సెల్ఫీ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

గత కొద్ది రోజుల నుంచి వీరు డేటింగ్ లో ఉన్నారంటూ ఇటీవలే చాలా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోపీ తరువాతనే వీరిపై రూమల్స్ చాలా ఎక్కువయ్యాయి. ఐపీఎల్ లీగ్ లో చాహల్ టీమ్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్ కు కూడా ఆర్జే మహ్ వష్ హాజరు కావడం చూస్తుంటే.. తాజాగా పోస్ట్ ఈ మ్యాచ్ కు నీ కోసమే వచ్చానంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే.. చాహల్ తో డేటింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని తెలుస్తోంది. వారి నుంచి అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు.


ఆర్జే మహ్ వశ్ తన ఇస్టాగ్రామ్ లో రాస్తూ.. ” వెనకాల ఉండి మద్దతు ఇచ్చే వారిలో మేము కూడా నీ వెనుక రాయిలా నిలబడి ఉన్నాం. నీకు మద్దతు ఇవ్వడం కోసం మేమంతా ఇక్కడికి వచ్చాం అంటూ పోస్ట్ చేసింది. స్టేడియంలో తన స్నేహిలతో పాటు పాటు మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం చాహల్ పోస్ట్ చేసిన సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న నెల రోజులకే లవర్ తో సెల్ఫీ తీసుకోవడం ఏంటి..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యజువేంద్ర చాహల్ ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వీళ్లు 2020 డిసెంబర్ 20న వీరి వివాహం జరిగింది. కానీ ఐదేళ్లకే వీరు తమ దారులు వేరు అంటూ విడిపోయారు. వీరు విడిపోయిన తరువాత చాహల్ ఎక్కువగా మహ్ వశ్ తో కలిసి కనిపిస్తుండటంతో రూమర్స్ వినిపించాయి. తాజాగా సెల్పీ తో రూమర్స్ కి చెక్ పెట్టినట్టయిందని చెప్పవచ్చు. వీరి సెల్ఫీ వైరల్ గా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×