Actress Kalpalatha : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటీనటులు అందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్లు ఎవరో ఒకరు ఉంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్న వాళ్లందరూ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. అలాంటి వారిలో నటి కల్పలత కూడా ఒకరు. ప్రస్తుతం సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రానిస్తూ బిజీగా ఉంది. బాహుబలి లాంటి సినిమాల్లో నటించింది. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు తల్లి పాత్రలో కల్పలత నటించారు. సినిమాల్లోకి రాకముందు ఈమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఇంటర్వ్యూలో బయట పెట్టిన కల్పలత రియల్ స్టోరీ..
సినీ నటి కల్పలత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. తాను సినిమాల్లోకి రాక ముందు ఎన్నో కష్టాలను అనుభవించినట్లు చెప్పారు. ఊర్లో ఉన్నపుడు పిడకలు కొట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి కష్టపడి చేరుకున్నాను. మొదట్లో పంజాగుట్ట నుండి కూకట్ పల్లికి డబ్బు లేక నడుచుకుంటూ వెళ్లేదాన్ని . అందరి జీవితాల్లోను కష్టపడటం ఉంటుంది. అలాగే నా జీవితంలోనూ ఉంది కాకపోతే కొందరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. నాకు ఎక్కడో చిన్న అదృష్టం ఉండటంతో నా జీవితం ఇప్పుడు ఇలా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.
Also Read : ఆక్సిజన్ మాస్క్‌తో పవన్ కుమారుడు.. ఈ ఫోటో చూస్తే గుండె బరువెక్కుతుంది..
కల్పలత సినీ కెరీర్ గురించి ఆసక్తి విషయాలు..
సినీ నటి కల్పలత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవకాశాలు లేదు. ప్రస్తుతం సినిమాల్లో హీరో, హీరోయిన్లకు అత్తగా, తల్లిగా నటిస్తూ వస్తున్నారు. బాహుబలి రెండు బాగాల్లోను కనిపించారు. పుష్ప సినిమాలో పుష్ప తల్లి పార్వతమ్మ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఉన్న కల్పలత సినీ జీవితం అనేది కొందరి మాత్రమే తెలుసు. ఆమె మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో రాణించింది. జూనియర్ ఆర్టిసి అంటే ఒకప్పుడు ఇండస్ట్రీలో లెక్క ఉండేది కాదని చాలామంది అనుకున్నారు. అయితే ఈమె ఇంటర్వ్యూలో జూనియర్ ఆర్టిస్టులు కూడా మనుషులే కదా అది ఆలోచించండి అంటూ అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈమె సీనియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట దూరదర్శన్ లో ముహూర్తం బలం అనే సీరియల్ తో నటిగా మారాను ఆపైన ఈటీవీ, జెమినీ టీవీల్లో సీరియల్స్ నటించి బాహుబలిలో నటించే అవకాశాన్ని అందుకుంది. అలా తన సినీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. పుష్ప 3 తో పాటు మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తుంది..