Venkatesh : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇండస్ట్రిలో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి సందర్బంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లోకి వెంకీ మామా కామెడీ క్రైమ్ స్టోరీతో తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం నేడు థియేటర్ల లోకి రిలీజ్ అయ్యింది.. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే జరగడంతో దుమ్ము దులిపేస్తుంది.. ఇటీవల రానా షో లో పాల్గొన్న వెంకీ మామా చెప్పిన నాలుగు సూత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు వెంకీ చెప్పిన ఆ నాలుగు జీవిత సూత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
సినిమా హీరోలు సినిమాను పూర్తి చెయ్యడం కన్నా సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మూవీ పూర్తి అవ్వగానే జనాల్లోకి వెళ్లేందుకు మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రానా హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో లో పాల్గొన్నారు వెంకీ. ఈ సందర్భంగా ఆనందకరమైన జీవితం గడపడానికి నాలుగు సూత్రాలు ఆచరిస్తే సరిపోతుందని చెప్పారు.. ఆ సూత్రాలను నేను పాటిస్తాను అందుకే ఇలా ఉన్నా అని చెప్పాడు. అవేంటంటే.. కష్టపడటం.. నివేదించటం.. బయటకు వచ్చేయడం.. అంగీకరించడం. మనం ఏ పని చేసినా కచ్చితంగా బాగా కష్టపడాలి. దాని ఫలితాన్ని ఈ ప్రపంచానికి వదిలేయాలి. ఈ రెండూ ఎంత ముఖ్యమో.. బయటపడటం, ఫలితాన్ని అంగీకరించడం కూడా అంతే ముఖ్యం అని వెంకటేశ్ చెప్పారు. నిత్యం ధ్యాన సాధన చేయడం, గురువులు తనకు ఇచ్చిన సలహాలు స్వీకరించడం వల్లనే ఈ సూత్రాలు పాటించడం తనకు సాధ్యమైందని తెలిపారు..
ఈరోజుల్లో జనాలు ప్రతి చిన్న వాటికి ఆందోళన కు గురవుతున్నారు. తాము చేస్తున్న పనికి ఫలితం రాలేదని బాధ పడిపోతున్నారు. ఇక నేను కూడా కష్టపడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని పూర్తి చేశాను. దాన్నుంచి బయటకు వచ్చేశాను. రిజల్ట్ ఎలా వచ్చినా దాన్ని తీసుకుంటా. ప్రస్తుతం జనాలు ఆందోళనపడటానికి కారణం వారి జీవితంలో జరిగే వాటిని అంగీకరించలేకపోవడమే అని వెంకీ పేర్కొన్నారు.. ఇక ఈయనకు అధ్యాత్మిక చింతన ఎక్కువే.. అప్పుడప్పుడు హిమాలాయాలకు వెళ్తాడు. అన్ స్టాపబుల్ టాక్ షోలో ఇటీవల వెంకటేశ్ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి మాట్లాడారు. ఇదే క్రమంలో రానా దగ్గుబాటి షోలో సంతోషకరమైన జీవితం గడపడానికి పాటించాల్సిన నాలుగు సూత్రాలు ఏంటనేది వివరించారు. మొత్తానికి తన కాన్సెఫ్ట్ తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ కుడా రాబడుతుంది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి… అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ మూవీ వచ్చింది.