Sankranthi Movies : సంక్రాంతి సీజన్ కి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటేనే ఒక సినిమాల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత చాలామందికి థియేటర్స్ లో పండగ మొదలవుతుంది. అసలు సంక్రాంతికి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడటం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. చాలామంది సినిమాలు చూడని వాళ్ళు కూడా సంక్రాంతి సీజన్ లో సినిమాలు చూస్తుంటారు. అందుకే చాలా సినిమాలకు మామూలు రోజుల్లో కంటే కూడా సంక్రాంతి రోజుల్లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతి సంక్రాంతికి తన బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. సంక్రాంతికి,దిల్ రాజుకి.. భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి అంబికా దర్బార్ భక్తి లాంటి బంధం ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, F2, వారసుడు వంటి ఎన్నో సినిమాలను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేశారు దిల్ రాజు. ఈ సినిమాలతో మంచి లాభాలను చూశారు.
అలానే ఈ సంక్రాంతికి మొదట రిలీజ్ అయిన సినిమా గేమ్ చేంజర్. దాదాపు ఈ సినిమా మూడేళ్ల నుంచి జరుగుతూ వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పూర్తిస్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా లేట్ అవ్వడంతో దిల్ రాజు దాదాపు 100 కోట్ల వరకు ఇంట్రెస్ట్ కట్టారు అని విశ్వసినీయ వర్గాల సమాచారం. ఇక గేమ్ చేంజెర్ సినిమా విషయానికి వస్తే చాలా చోట్ల హౌస్ ఫుల్ పడటం కూడా లేదు. బహుశా దీనిపైన ఒక అవగాహన ఉండటం వలన ఏమో తన బ్యానర్ నుంచి మరో సినిమాను సిద్ధం చేసి ఉంచారు దిల్ రాజు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టారు. పాటల కోసం చాలా ఖర్చు పెట్టారు. అంతేకాకుండా సినిమాలో కూడా విపరీతమైన స్టార్ కాస్ట్ ఉంది వాళ్ల రెమ్యూనరేషన్, సాంగ్ బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా పూర్తిగా అయ్యేసరికి దాదాపు 100 కోట్లకు పైగా నష్టం వచ్చే అవకాశం కూడా ఉందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన మరో సినిమా డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ఈ బిజినెస్ కి అంతగా వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడక్షన్ విషయంలో భారీగా ఖర్చుపెట్టారు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ. ఈ సినిమా కోసం పలుచోట్ల షూటింగ్ జరిపారు. ఇక ఈ సినిమా మామూలు కథ అయినా కూడా బాబి ట్రీట్మెంట్ చేసిన విధానం కొంతమేరకు ఆకట్టుకుంది. బాలకృష్ణ సినిమా అంటే ఎటువంటి యాక్షన్ అంశాలుంటాయో వాటిని కూడా ఈ సినిమాల్లో పొందుపరిచాడు బాబి. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ముందుకు రారు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎదురు చూసేది యాక్షన్ గురించి కాదు. ఎంటర్టైన్మెంట్ గురించి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొద్దిస్థాయిలో మాత్రమే ఉంటుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే సంక్రాంతికి వస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సినిమా కథ, కథనం వంటి అంశాలు పక్కన పెడితే పూర్తిస్థాయి వినోదంతో కూడుకుని ఉంది. ఈ సినిమాకి ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమాలలో కొద్ది గొప్పో ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా లాభాలు పరంగా నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎక్కువగా షూటింగ్ చేసి ఎడిటింగ్ టేబుల్ దగ్గర డైరెక్షన్ చేయకుండా పేపర్ మీదే చాలా వరకు కటింగ్ చేశాడు. మూడు నిమిషాలు సీన్ పేపర్ మీద ఉంటే అది మాత్రమే షూట్ చేశాడు. అలా కేవలం 70 నుంచి 75 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి రిలీజ్ కి సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకోకపోయినా కొంతమేరకు వినోదాన్ని మాత్రం అందించింది. మామూలుగా ప్రేక్షకులు కోరుకునే వినోదం ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉంది.
ఇక చివరిగా సంక్రాంతి అంటేనే థియేటర్లు దొరకని పరిస్థితి. ప్రతి సంక్రాంతి పోటీ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి మాత్రం పెద్దగా పోటీ లేదు. పెద్దగా హిట్ అయిన సినిమా కూడా లేదు. మొత్తంగా ఇది ఒక సో సో సంక్రాంతి అని చెప్పొచ్చు.