BigTV English
Advertisement

Charmy Kaur: పీకల్లోతు కష్టాల్లో ఛార్మి.. డబుల్ ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు షాక్ తప్పదా ?

Charmy Kaur: పీకల్లోతు కష్టాల్లో ఛార్మి.. డబుల్ ఇస్మార్ట్ ఫ్యాన్స్ కు షాక్ తప్పదా ?

Charmy Kaur : పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కలయికలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. ఈ నెల 15వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. ఓవర్సీస్ లో ఆగస్టు 14నే ప్రీమియర్ షో లు పడనున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క క్లైమాక్స్ సీన్ కోసం వేసిన సెట్ కే రూ.7.5 కోట్లను ఖర్చు చేశారన్న టాక్ ఉంది. అంతేకాదు. క్లైమాక్స్ లో వందలమంది ఫైటర్లు కూడా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ నటించింది.


అంతా ఓకే. కానీ.. ఇప్పుడే బయటికొచ్చిన ఒక విషయం రామ్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. డబుల్ ఇస్మార్ట్ కు ప్రొడ్యూసర్ గా ఉన్న ఛార్మీ.. పీకల్లోతు కష్టాల్లో ఉందని.. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బును సర్దే విషయంలో కంగారు పడుతోందని సమాచారం. అందుకు కారణం.. లైగర్ సినిమా తెచ్చిన నష్టాల కష్టాలే. లైగర్ సినిమాకు ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చూడక తప్పలేదు. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కు ముందు తాము నష్టపోయిన మొత్తాన్ని ఇవ్వాలని కండీషన్ పెట్టారు.

డిస్ట్రిబ్యూటర్ల కండీషన్ తో పూరి జగన్నాథ్ – ఛార్మీ ల మధ్య వివాదం నడిచిందని కూడా తెలిసింది. లైగర్ సినిమా కారణంగా నష్టపోయిన వారికి డబ్బు సర్దే పనిలో పడ్డారు ఛార్మీ. తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు రూ.8.5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరిలో వరంగల్ శ్రీనుకే రూ.కోటి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పుడు రూ.50 లక్షలు ఇచ్చి.. డబుల్ ఇస్మార్ట్ రిలీజయ్యాక మరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Also Read: పూరీ, మణిశర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో రామ్

ఇక ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు రూ.4 కోట్లు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.50 లక్షలు, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు రూ.4 కోట్లు ఇవ్వనున్నారు. అందరూ ఇందుకు అంగీకరించినా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మాత్రం అందుకు అంగీకరించలేదని టాక్.

ఒక పక్క ఎగ్జిబిటర్లు, మరో పక్క ఫైనాన్షియర్లకు ఛార్మీ డబ్బులు సర్దాల్సి ఉంది. సరిగ్గా డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు ముందు ఛార్మీకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటో పాపం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రైమ్ షో లు వేసేందుకు ఒప్పుకున్నప్పుడే ఇవన్నీ సెటిల్ చేసుకుని ఉంటే.. ఈ రోజున డబుల్ ఇస్మార్ట్ ప్రైమ్ షో పడేదో లేదోనన్న టెన్షన్ ఉండేది కాదంటున్నారు. రెండ్రోజుల్లో రూ.80 కోట్లు ఛార్మీ కట్టాల్సి ఉంది. దేవుడా.. ఛార్మీ కష్టాలు తీర్చి .. డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు లైన్ క్లియర్ చెయ్ అని వేడుకుంటున్నారు రామ్ ఫ్యాన్స్. చూద్దాం మరి ఛార్మీ లక్ ఎలా ఉందో.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×