Lokesh Kanagaraj : డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రముఖ నటుడు శ్రీరామ్ నటరాజన్ (Shriram Natarajan) అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు స్పెషల్ నోట్ ని రిలీజ్ చేస్తూ, ఆయన ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా శ్రీరామ్ ఆరోగ్యంపై ఎలాంటి పుకార్లు స్ప్రెడ్ చేయకూడదని ఈ సందర్భంగా ఆయన రిక్వెస్ట్ చేశారు.
శ్రీరామ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన లోకేష్
శుక్రవారం రోజు లోకేష్ కనగరాజ్ ఎక్స్ లో ఓ స్పెషల్ నోట్ ని రిలీజ్ చేశారు. శ్రీరామ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో శ్రీరామ్ నటరాజన్ హెల్త్ పై షికార్లు చేస్తున్న పుకార్లకు సమాధానాలు ఇస్తూ, హెల్త్ అప్డేట్ రిలీజ్ చేశారు. “శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, మీడియా సభ్యులందరికీ మేము ఈ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాం. నటుడు శ్రీరామ్ హాస్పిటల్ లో డాక్టర్స్ సంరక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ సలహా మేరకు సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకుంటున్నారు. కోలుకోవడం పై ఆయన దృష్టి పెట్టడంతో ప్రతి ఒక్కరూ శ్రీరామ్ ప్రైవసీని గౌరవించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రకరకాల ఊహాగానాలతో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీరామ్ కోలున్నాక ఎప్పటిలాగే ప్రేక్షకులని అలరిస్తాడు. అప్పటిదాకా మీ ప్రేమ, సపోర్ట్ మాకు ఉండాలని ఆశిస్తున్నాము. థాంక్స్” అంటూ ఆ నోట్ లో శ్రీరామ్ హెల్త్ పై అప్డేట్ ఇచ్చారు. శ్రీరామ్ ఆరోగ్యం గురించి అభ్యంతరకరమైన వీడియోలు లేదా ఇంటర్వ్యూలను తొలగించాలని అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లకు విజ్ఞప్తి చేశారు.
అసలు ఈ శ్రీరామ్ ఎవరు? అతనికి ఏమైంది?
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన ‘నగరం’ మూవీలో హీరోగా నటించాడు శ్రీరామ్ నటరాజన్. కొంతకాలంగా శ్రీరామ్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్నాడు. కానీ అతని పాత లుక్, ప్రజెంట్ లుక్ కి తేడా ఉండడంతో అసలు ఏమైంది అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కొన్ని రోజుల నుంచి తాను నటించిన సినిమాలకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తరువాత శ్రీరామ్ మిస్ అవ్వడం సస్పెన్స్ గా మారింది.
అతను ఎవరు ఫోన్ చేసినా ఎత్తట్లేదని, శ్రీరామ్ గుర్గాన్ లో ఉన్నట్టుగా లొకేషన్ ట్రేస్ చేసి తెలుసుకున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతను Schizophrenia అనే ఓ వ్యాధితో బాధపడుతున్నాడని అన్నారు. ఇది ఒక రకమైన వాయిస్ హాలోజిటేషన్. ఫాల్స్ వాయిస్ వినడం లాగా అన్నమాట. దీంతో త్వరగా అతన్ని కనిపెట్టి తీసుకురావాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరారు.
ఎట్టకేలకు తాజాగా శ్రీరామ్ ఆరోగ్యంపై స్వయంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అప్డేట్ ఇవ్వడం గమనార్హం. అయితే ఆ హెల్త్ అప్డేట్ లో అసలు శ్రీరామ్ కు ఏమైంది? ఎందుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు? అనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
Read Also : ‘పెద్ది’ కోసం రంగంలోకి కాజల్…. మరో జిగేల్ రాణి అవుతుందా?
శ్రీ చివరిసారిగా 2023లో యువరాజ్ శయాలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుగపత్రు’ సినిమాలో తెరపై మెరిశాడు. ‘వజక్కు ఎన్ 18/9’తో అరంగేట్రం చేసిన ఆయన ‘ఓనాయుమ్ ఆటుకుట్టియుమ్’, ‘సోన్ పాప్డి’, ‘విల్ అంబు’, ‘మానగరం’ వంటి సినిమాలలో కూడా నటించాడు
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) April 18, 2025