BigTV English

Urvashi Rautela: దక్షిణాదిలో నాకు గుడి కట్టండి.. నార్త్ పై ఊర్వశీ ఊహించని కామెంట్స్..!

Urvashi Rautela: దక్షిణాదిలో నాకు గుడి కట్టండి.. నార్త్ పై ఊర్వశీ ఊహించని కామెంట్స్..!

Urvashi Rautela:గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకోవడానికి తమకు ఇష్టమైన హీరోయిన్ కి లేదా హీరోకి గుడి కట్టిస్తూ.. వారినే ఆరాధ్య దైవంగా భావిస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే హన్సిక(Hansika ), కుష్బూ (Khushbu), సమంత (Samantha) లాంటి ఎంతోమంది నటీమణులకు అభిమానులు గుడి కట్టించి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ బ్యూటీ మాత్రం తనకు దక్షిణాదిలో గుడి కట్టి ఆరాధించండి అంటూ షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఆమె ఎవరు? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


దక్షిణాదిలో నాకు గుడి కట్టండి – ఊర్వశీ

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela).. తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. ఊర్వశీ మాట్లాడుతూ..” ఉత్తరాదిన నా పేరు మీద ఆలయం ఉంది. బద్రీనాథ్ కి ఎవరైనా వెళ్తే కచ్చితంగా ఆ పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కూడా నా ఫోటోకి పూలమాలలు వేసి నన్ను ‘దండమమాయి’ అని పిలుస్తున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. కానీ ఇదే నిజం . దీనిపై ఎన్నో వార్తా కథనాలు కూడా వచ్చాయి. మీరు కావాలంటే చదవచ్చు కూడా.. ఇక సౌత్ వాళ్లు కూడా నాకు బాగా తెలుసు. ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా నిలిచిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) తో నేను కలిసి నటించాను. అక్కడ కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కాబట్టి నాకు దక్షిణ భారతదేశంలో కూడా ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నాను ” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ వాళ్ళు తనకు గుడి కట్టారని కాబట్టి దక్షిణాది వాళ్ళు కూడా గుడి కట్టాలని ఆశిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది ఊర్వశీ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లకు యాంకర్ కూడా ఆశ్చర్యపోయింది.


మీ ఆశీర్వాదం తీసుకుంటారా అంటూ యాంకర్ ప్రశ్న..

ఆశ్చర్యపోయిన యాంకర్ ఇలా ప్రశ్నించింది. “మీ గుడికి వచ్చిన వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా ?” అని అడగ్గా.. “అది ఆలయం.. అన్నిచోట్ల ఏం జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయి” అంటూ కామెంట్ చేసింది ఊర్వశీ ఇక ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈమెకు పిచ్చిగాని పట్టలేదు కదా.. తాను దేవత అనుకుంటోందా అంటూ ఇలా రకరకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు

ఊర్వశీ సినిమాలు..

ఇక ఊర్వశీ విషయానికి వస్తే.. తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద, డాకు మహారాజ్ తో పాటు పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈమె.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాషన్ ట్రెండీ దుస్తులలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.’సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన ఈమె.. ఇప్పుడు ఐకానిక్ స్టార్ గా పేరు సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×