Peddi Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు (Buchibabu) దర్శకత్వంలో ‘పెద్ది’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో రామ్ చరణ్ లుక్, విజువల్స్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాపై అంచనాలు భారీగా పెరగగా, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ సినిమాలో ‘పెద్ది’తో కలిసి ఓ స్పెషల్ సాంగ్లో చిందేయబోతోంది అన్నది ఆ వార్తల సారాంశం.
‘పెద్ది’తో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్
సినిమాలలో స్పెషల్ సాంగ్ లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హీరోయిన్లు సినిమా మొత్తం కనిపించి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో, ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా అదే రేంజ్ లో పారితోషకం డిమాండ్ చేస్తారు. తెరపై కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే ఉంటుంది. అంతేకాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రేజీగా పెరుగుతుంది. ఇక ఆ సాంగ్ వల్ల సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. ఇప్పటికే ‘పుష్ప’లో సమంత, ‘పుష్ప 2’లో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్స్ క్రేజ్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. కాగా కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ‘పక్కా లోకల్’ అనే ఈ సాంగ్ అప్పట్లో మూవీ లవర్స్ ని బాగానే ఊపేసింది. అలాగే రామ్ చరణ్ తో ఇప్పటికే కాజల్ అగర్వాల్ రెండు సార్లు కలిసి నటించింది. మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలలో హీరోయిన్ గా రామ్ చరణ్ సరసన రొమాన్స్ చేసింది కాజల్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ కి రెడీ అవుతోంది.
Read Also : హాస్పిటల్లో నగరం హీరో శ్రీరామ్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్
మరో జిగేల్ రాణిగా మారుతుందా?
గతంలో ‘రంగస్థలం’ సినిమాలో ఇలాగే పూజా హెగ్డే ‘జిగేల్ రాణి’ అంటూ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది. ఆ పాట తర్వాత పూజా హెగ్డే కెరియర్ పీక్స్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి బ్రేక్ కోసం చూస్తున్న కాజల్ అగర్వాల్ కి ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ బూస్ట్ ఇస్తుందా ? కాజల్ మరో జిగేల్ రాణిగా పేరు తెచ్చుకుంటుందా? అనేది చూడాలి.