Vijay Sethupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నేడు వరుస సినిమాలలో నటిస్తూ.. అటు హీరోగా, ఇటు విలన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. అలా ఇబ్బందులు పడుతున్న సమయంలోనే సోషల్ మీడియా ద్వారా జెస్సీ అనే అమ్మాయి పరిచయం అయ్యింది. అలా విజయ్ సేతుపతి దుబాయ్లో ఉద్యోగం చేసే సమయంలో ఈమెతో చాటింగ్ లోనే పరిచయం పెంచుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, తమ ప్రేమను పంచుకున్నారు. ఈ ఇద్దరి ప్రేమను వాళ్ళ కుటుంబాలు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే జెస్సీ మలయాళీ కాగా, విజయ్ సేతుపతి తమిళియన్. ముఖ్యంగా విజయ్ సేతుపతి కుటుంబ సభ్యులే ఈ వివాహానికి ఒప్పుకోలేదట. కానీ ఎలాగోలా వారిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారట ఈ జంట.
ప్రేమించారు కానీ.. ఎంగేజ్మెంట్ లోనే తొలి చూపులు..
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. విజయ్ సేతుపతి , జెస్సీ ప్రేమ కథలో మరో ట్విస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదేంటంటే జెస్సీని విజయసేతుపతి మొదటిసారి ఎంగేజ్మెంట్ రోజే కలిసారట. అలా ఎంగేజ్మెంట్లో చూసి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఏది ఏమైనా చాటింగ్లో పరిచయమైన అమ్మాయిని, ఇలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విషయమే. అంతేకాదు ఎంగేజ్మెంట్ వరకు చూడకుండా.. డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ రోజే ఆమెను చూసి ఎంగేజ్మెంట్ చేసుకోవడం అంటే ఇక వీరి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇది చూసిన చాలామంది విజయ్ సేతుపతి ప్రేమ ట్రూ లవ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ సేతుపతి, జెస్సీల లవ్ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇకపోతే ఈ జంటకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సూర్య, కుమార్తె శ్రీజ ఉన్నారు. చదువుకునే రోజుల్లోనే మరణించిన తన స్నేహితుడి జ్ఞాపకార్థమే తన కొడుకుకు సూర్య అని పేరు పెట్టారు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి తోబుట్టువుల విషయానికి వస్తే.. వీరు మొత్తం నలుగురు సంతానం
ఈయనకు ఒక అన్నయ్య, ఒక చెల్లెలు , ఒక తమ్ముడు కూడా ఉన్నారు.
విజయ్ సేతుపతి కెరియర్..
ఇక విజయ్ సేతుపతి కెరియర్ విషయానికి వస్తే.. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మేర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కంటే ముందు కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించిన ఈయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లేయర్ రచయితగా, గాయకుడిగా, పాటల రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు. ఇక 2019లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన విజయసేతుపతి.. 2021 లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించి అబ్బురపరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఈయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనడంలో సందేహం లేదు. అంతలా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈయన తెలుగు, తమిళ్ భాష ఇండస్ట్రీలకు మాత్రమే పరిమితం కాకుండా.. మలయాళం, హిందీ చిత్రాలలో నటిస్తూ పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకుంటున్నారు విజయ్ సేతుపతి. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో కీ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు..