Denver Airport : అమెరికాలో ఓ విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టులో దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ట్రావెలర్స్‌ని బయటకు పంపించారు. అయితే విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను కిందకు దింపుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
అసలేం జరిగింది?
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం బయలు దేరింది. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్‌లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్‌కు మళ్లించారు.
డెన్వర్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ఎయిర్‌పోర్టులోని టాక్సీయింగ్ ప్రాంతంలో విమానం దిగింది. క్షణాల వ్యవధిలో ఇంజిన్‌లో మంటలు తలెత్తాయి. అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపారు.
ట్రావెలర్స్ అంతా సేఫ్
విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకు దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్ వైరల్‌గా మారాయి. విషయం ఏంటంటే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. విమానంలో మంటల ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు.
ALSO READ అమెరికా ప్రతిపాదనలతో లాభం లేదు
ఎయిర్‌పోర్టులో ప్రయాణికులంతా చూస్తుండగానే విమానం దగ్ధమైంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు దించారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విమానం ఏ సమయంలో మంటల్లో చిక్కుకుందనే దానిపై స్పష్టత రాలేదు.
విమానాశ్రయంలో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి ఉన్న ఓ మహిళ తన ఫోన్‌లో ఆయా దృశ్యాలను రికార్డు చేసింది. విమానం నుండి పెద్ద ఎత్తున పొగలు, డజన్ల కొద్దీ ప్రయాణికులు పారిపోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. తొలుత ఘటనను చూసి తాను భయపడ్డానని తెలిపింది ఆ మహిళ. ప్రయాణీకులను చూసి తాను భయపడ్డానని వెల్లడించింది.
ఘోరమైన ప్రమాదాలు
ఈ మధ్యకాలంలో తరచు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు వారాల కిందట టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై డెల్టా ఎయిర్ లైన్ కి చెందిన ఓ విమానం క్రాష్ అయిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో భయంకరమైన విమాన ప్రమాదాలు జరిగాయి.
అలాస్కా, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్, DC ల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి. జనవరిలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం యూఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీ కొట్టిన ఘటనలో 67 మంది మరణించారు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో జరిగిన విమాన ప్రమాదాలలో 200 మందికి పైగా మరణించారు కూడా.
JUST IN: American Airlines flight catches on fire at Denver International Airport, passengers seen running through the smoke.
The footage was shared by Joshua Sunberg on Instagram who was at the airport. #americanairline #Fire #denverairport pic.twitter.com/L0nKxc8QGG
— Dilojan 𝕏 (@umadilojan) March 14, 2025