BigTV English

Lucky Bhaskar : “లక్కీ భాస్కర్” రిలీజ్ ఆలస్యం… ఆ ఒక్క భాష ప్రేక్షకులకే ఈ ట్విస్ట్

Lucky Bhaskar : “లక్కీ భాస్కర్” రిలీజ్ ఆలస్యం… ఆ ఒక్క భాష ప్రేక్షకులకే ఈ ట్విస్ట్

Lucky Bhaskar : భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరోలలో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు. ముఖ్యంగా ఈ మలయాళ హీరోకి టాలీవుడ్లో మహానటి, సీతారామం వంటి సినిమాలతో క్రేజీ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. కానీ ఈ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడి ఎట్టకేలకు దీపావళి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అయింది. కానీ అంతలోపే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఓ భాష ప్రేక్షకులకు ఇది షాక్ అని చెప్పొచ్చు.


ఆ ఒక్క భాషలో రిలీజ్ ఆలస్యం

వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాను ముందుగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ అదే డేట్ కి థియేటర్లలోకి దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గోట్’ అనే సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. ఎలాంటి పోటీ లేకుండా సోలోగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్ సినిమాను అక్టోబర్ 31కి వాయిదా వేశారు. ఇక ప్రస్తుతం దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. అక్టోబర్ 24 న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఒక వారం రోజులు ఆలస్యంగా రిలీజ్ కాబోతోందని సమాచారం. అయితే అది కూడా అన్ని భాషల్లోనూ కాకుండా కేవలం ఒక్క భాషలోనే ఈ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది.


ఆలస్యం ఎందుకంటే ?

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ‘లక్కీ భాస్కర్’ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో మేకర్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చెప్పినట్టుగానే అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఒక్క హిందీ భాషలో మాత్రం ఒక వారం తర్వాత అంటే నవంబర్ మొదటివారం ఎండింగ్లో ‘లక్కీ భాస్కర్’ ను థియేటర్లలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ ఒక్క భాషలోనే లేటుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఎందుకు నిర్వహించుకున్నారంటే ఆ టైంలో హిందీలో మరో భారీ సినిమా రిలీజ్ కాబోతోంది. హిందీలో మంచి క్రేజ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగం అగైన్’ నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ గురించి హిందీ మూవీ లవర్స్ ఎంత ఈగరుగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ లక్కీ భాస్కర్ సినిమాను హిందీలో ఒక వారం ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×