Lucky Bhaskar : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తున్నారు. ఇక కొందరు వేరే భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అవుతూన్నారు. తమిళ హీరోలు తెలుగులో సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ ను కొడుతున్నారు. ఇప్పటికే అక్కడ స్టార్ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన సినిమాలలో బ్లాక్ బాస్టర్ మూవీ ‘లక్కీ భాస్కర్ ‘.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడం తోపాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగ వంశీ రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యల పై తాజాగా బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ స్పందించారు. ఆయనకు లక్కీ భాస్కర్ మూవీకి లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యల పై బాలీవుడ్ డైరెక్టర్ హన్సల్ మెహతా ఖండించారు. గర్వం ఎక్కువగా ఉందని ఆయన మాత్రమే ప్రొడ్యూసర్ అని విర్రవీగుతున్నాడని బాలీవుడ్ ను ఉద్దేశించి అలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే ఆయన నిర్మాతగా వ్యవహరించిన రీసెంట్ మూవీ లక్కీ భాస్కర్ ను నేను డైరెక్షన్ చేసిన ‘స్కాం 1992’ సిరీస్ ని ఆధారంగా చేసుకుని తీశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దాంట్లో క్రెడిట్ మాకు కూడా దక్కుతుంది అంటూ ఆయన నిర్మాత పై మండిపడ్డారు. మీరు హిట్ సినిమాలను చేస్తున్నారు. కానీ మా సినిమాల నుంచి కాపీ కొడుతున్నారు అని షాక్ ఇచ్చాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తీసిన సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను కూడా చక్కగా చూపించారు. ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా వ్యూస్ ను రాబడుతుంది…
భారీ సక్సెస్ ను అందుకోవడం బాలీవుడ్ ప్రముఖులకు డైజెస్ట్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. నాగ వంశీ చేసిన వ్యాఖ్యలకు వెంకీ అట్లూరి ని ఉద్దేశిస్తూ హన్సల్ మెహతా కొన్ని కామెంట్లు చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తున్న సందర్భంలో బాలీవుడ్ హీరోలకి కొంతవరకు మింగుడు పడడం లేదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుష్ప 2 బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుందో చెప్పనక్కర్లేదు. 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ వ్యాఖ్యల పై ప్రొడ్యూసర్ నాగ వంశీ ఎలా రియాక్ట్ అవుతారో.. వీరి వాదనలు ఎలాంటి వివాదాలను తీసుకొస్తాయో అని సినీ ప్రముఖులు టెన్షన్ పడుతున్నారు. ఇక సంక్రాంతికి తెలుగు సినిమాల సందడి మాములుగా లేదు. స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. ఏ మూవీ హిట్ అవుతుందో చూడాలి..