BigTV English

OTT Movie : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి… ముఫాసతో మొదలుపెడితే…

OTT Movie : హాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి… ముఫాసతో మొదలుపెడితే…

OTT Movie : ఓటిటిలో హాలీవుడ్ సినిమాలను చూడటానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అయితే ఈ జనవరిలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటిటిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు థియేటర్లలో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ముఫాసా లాంటి సినిమాలను ఫ్యామిలీతో సహా కలసి చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఓటీటీలోకి వస్తున్న ఈ బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయో తెలుసుకుందాం పదండి.


ముఫాసా : ది లయన్ కింగ్ (Mufasa : The Lion King)

2024 డిసెంబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా రెలిజ్ అయింది. ముఫాసా : ది లయన్ కింగ్ కు బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, జెఫ్ నాథన్సన్ స్క్రీన్ ప్లే అందించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్, పాస్టెల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఫోటోరియలిస్టిక్‌గా యానిమేషన్ చేయబడింది. ఆరోన్ పియర్, కెల్విన్ హారిసన్ జూనియర్, మాడ్స్ మిక్కెల్‌సెన్, థాండివే న్యూటన్, టిఫనీ బూన్, లెన్నీ జేమ్స్,  బ్లూ ఐవీ కార్టర్ ఈ మూవీలోకి అరంగేట్రం చేశారు.  ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్ని +హాట్స్టార్ (Disney +Hotstar) లో 2025 జనవరి చివరివారం నుండి  స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.


వెనం : ది లాస్ట్ డాన్స్ (Venam : The Last Dance)

2024 లో  రిలీజ్ అయిన ఈ సూపర్ హీరో మూవీకి కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. మార్వెల్ కామిక్స్ పాత్ర వెనమ్ ఆధారంగా, ఈ మూవీ  వెనమ్, వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్, తరువాత వెనం : ది లాస్ట్ డాన్స్ చివరిగా వచ్చింది. టామ్ హార్డీ ఎడ్డీ బ్రోక్ వెనమ్ గా నటించగా, కొత్త తారాగణం గా చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, స్టీఫెన్ గ్రాహం, పెగ్గి లు, క్లార్క్ బ్యాకో, అలన్నా యుబాచ్, ఆండీ సెర్కిస్ నటించారు. జూన్ 2023 లో స్పెయిన్‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఫిబ్రవరి 2024 లో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. వెనం: ది లాస్ట్ డాన్స్ అక్టోబర్ 21, 2024న న్యూయార్క్ నగరంలోని రీగల్ టైమ్స్ స్క్వేర్ థియేటర్లో ప్రదర్శించబడింది. అక్టోబర్ 25న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. 2025 జనవరి చివరలో నెట్ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (The Night Agent Season 2)

మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో, దీనికి సీక్వెల్ గా సీజన్ 2 ని కూడా తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ వెబ్ సిరీస్ ను 2025 జనవరి 23 నుంచి  ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కిడ్నాప్, హత్య, కుట్రలతో సాగే ఈ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుందనడంలో సందేహం లేదు. ఒక గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే తొందర్లో ఓటీటిలోకి రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×