BigTV English

M4M Movie : సెన్సేష‌న‌ల్ కాన్సెఫ్టుతో ప్రేక్షకుల ముందుకు

M4M Movie : సెన్సేష‌న‌ల్ కాన్సెఫ్టుతో ప్రేక్షకుల ముందుకు

M4M Movie :  మూవీ మేక‌ర్ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెర‌కెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అంద‌రికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్టుతో తెర‌కెక్కించామ‌ని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసిన‌ట్టు తెలిపారు. రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.


ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ”ఇటీవ‌ల ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఆధ్వ‌ర్యంలో విడుద‌ల చేయ‌డంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని, అంచ‌నాలు భారీగా పెరిగాయన్నారు. ఎక్సలెంట్ టీంతో సినిమాను ఎంతో అద్భుతంగా పూర్తి చేశామన్నారు. హీరోయిన్ జో శర్మ త‌న ఫ‌ర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా మారింద‌ని డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల తెలిపారు. హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించామ‌ని, క‌థ‌, క‌థ‌నాల‌ను న‌మ్ముకునే సినిమాను తీశాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల ఆస‌క్తిక‌ర‌మైన కాంపిటీష‌న్ ప్ర‌క‌టించారు. విడుద‌లైన‌ ఫ‌స్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

Also Read : Venky Atluri on Dhanush : అందుకే నా కథను తెలుగు హీరోలు రిజెక్ట్ చేశారు


హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. నేను ముందుగా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ వడ్లపట్ల గారికి. నాకు గాడ్‌ఫాద‌ర్ ఆయ‌న‌. నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైద‌రాబాద్‌కు ఈ ఏడాదే ఆరు సార్లు వ‌చ్చాను. నేను ఇందులో ఇన్విస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా చేశాను. క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌తో న‌డిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా చూసిన వాళ్లంద‌రి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

ఈ సంద‌ర్బంగా గోవా తీరంలో హీరోయిన్ జోశర్మ (USA) తళుక్కుమంటూ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. M4M మూవీ ట్రైలర్ గోవాలో లాంచ్ చెయ్యడం కొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. ఇలాంటి కాన్సెప్ట్ 110 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్ అని, తాను ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం గ‌ర్వంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్లకు, IMPPA ప్రముఖులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెర‌కెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను త్వ‌ర‌లోనే 5 భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

Also Read : Nari Movie : “నారి” సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×