Venky Atluri on Dhanush : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వెంకీ అట్లూరి ఒకరు. ముందుగా హీరోగా తన కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నటుడుగా కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత రచయితగా మారాడు. స్నేహగీతం సినిమాతో తనకంటూ మంచి ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ సినిమాతో వెంకీ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బాక్స్ ఆఫీస్ వద్ద తొలిప్రేమ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ టైటిల్ తోనే ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైటిల్ తో సినిమా వస్తుంది అంటే చాలామంది క్యూరియాసిటీతో ఎదురు చూశారు. మొత్తానికి ఈ క్యూట్ లవ్ స్టోరీ తో సక్సెస్ అయిపోయాడు వెంకీ.
తొలిప్రేమ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా మిస్టర్ మజ్ను అనే సినిమాను తీశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత నితిన్ హీరోగా రంగ్ దే అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. నితిన్ సరసన ఈ సినిమాలు కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా కూడా ఊహించిన రేంజ్ లో ఆడలేదు. అయితే ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కూడా లండన్ లో జరుగుతుంది. అప్పట్లో తన నాలుగవ సినిమా సార్ ను ధనుష్ తో అనౌన్స్ చేశాడు వెంకీ. అప్పుడు కూడా ఈ సినిమా సెకండాఫ్ ఫారన్ లో జరగబోతుంది అంటూ చాలామంది మీమ్స్ వేశారు. మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అసలు వెంకీ అట్లూరి ఇలాంటి సినిమా తీశాడా అంటూ చాలామంది ప్రశంసలు కూడా కురిపించారు.
రీసెంట్ టైమ్స్ లో వెంకీ అట్లూరి హిట్ అందుకున్న సినిమా లక్కీ భాస్కర్. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు వెంకీ అట్లూరి. ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు రివీల్ చేశాడు. తను దర్శకత్వం వహించిన సార్ సినిమా కథను తెలుగులో కొంతమంది హీరోలకు చెప్పినప్పుడు. దీనిలో హ్యాపీ ఎండింగ్ లేదు అని డౌట్ పడ్డారట. కొంతమంది నిర్మాతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ధనుష్ మాత్రం కథ వినగానే చప్పట్లు కొట్టి మీకు డేట్స్ ఎప్పటినుంచి కావాలి అని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా వెంకీ అట్లూరి తెలిపాడు. అలానే తన కెరియర్ లో ఇంత బాగా రిసీవ్ చేసుకున్న హీరో ఇంకొకరు లేరు అంటూ కూడా చెప్పుకొచ్చాడు.
Also Read: Prabhas – OG Movie : ఓజి సినిమాలో ప్రభాస్, అసలేం సెట్ చేసావ్ రా సుజిత్ గా.?