BigTV English

Nithiin: సుదర్శన్ థియేటర్లో తన కం బ్యాక్ ఫిలిం చూసి మురిసిపోతున్నాడు

Nithiin: సుదర్శన్ థియేటర్లో తన కం బ్యాక్ ఫిలిం చూసి మురిసిపోతున్నాడు

Nithiin: జయం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తేజ దర్శకత్వంలో వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. ఈ సినిమాతోనే సూపర్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా అడుగులు వేశారు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అక్కడితో నితిన్ పతనం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఏ సినిమా చేసినా కూడా అది బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్ని కాంబినేషన్స్ లో సినిమా సెట్ అయినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తూనే ఉన్నాయి. మొత్తానికి అందరూ నితిన్ కెరియర్ అయిపోయింది అని అనుకున్నారు. ఎట్టకేలకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఇసుక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరైనప్పుడు చాలామందికి తెలిసింది. నితిన్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద అభిమాని అని, ఆన్ స్టేజ్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ తన ప్రేమని అంతా వలకబోశాడు నితిన్. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ కి అభిమానులుగా మారారు. ఇక నితిన్ సినిమా వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నితిన్ సినిమాలు చూడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత నితిన్ చేసిన ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆ సినిమాలు కూడా అలానే సక్సెస్ అవుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ నితిన్ అభిమాని కావడంవల్లనే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అ ఆ లాంటి సినిమాను నితిన్ తో చేశాడు.

ఇక ఇష్క్ సినిమా విషయానికి వస్తే విక్రమ్ కే కుమార్ నితిన్ ని చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. అలానే నితిన్,నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి పీసీ శ్రీరామ్ అందించిన విజువల్స్ బిగ్గెస్ట్ హైలెట్ అని చెప్పాలి. అలానే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా రీ రిలీజ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు ఇష్క్ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఇకపోతే ఈ సినిమాను ప్రస్తుతం సుదర్శన్ థియేటర్లో నితిన్ చూస్తూ మురిసిపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులతో తన కంబ్యాక్ ఫిలిం చూడడం అనేది అది ఒక హై ఫీలింగ్ అని చెప్పాలి. నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కి సిద్ధమవుతుంది.


Also Read : Prabhas – OG Movie : ఓజి సినిమాలో ప్రభాస్, అసలేం సెట్ చేసావ్ రా సుజిత్ గా.?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×