Maadhavi Latha: హీరోయిన్ మాధవీ లత పర్సనల్ లైఫ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇటీవల జేసీ ప్రభాకర్.. మాధవీ లతపై పబ్లిక్‌గా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు మాధవీ లత వెంటనే స్పందించకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఇన్‌డైరెక్ట్‌గా గట్టి కౌంటరే ఇచ్చింది. గత కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అయినా కూడా మాధవీ లత కోపం తగ్గలేదు. అందుకే తాజాగా ‘మా’ అసోసిసయేషన్‌ను ఆశ్రయించింది. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును శివబాలాజీ అందుకున్నాడు. తాజాగా ప్రెస్ ముందు తన కంప్లైంట్‌ను శివబాలాజీకి అందజేసింది మాధవీ లత (Maadhavi Latha). దీంతో ‘మా’ కూడా తనకు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యిందని అర్థమవుతోంది.
క్యారెక్టర్‌లెస్ అంటూ వ్యాఖ్యలు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కొన్నాళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్‌లో మాధవీ లతపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. తనను క్యారెక్టర్‌లెస్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో మాధవీ లతకు సపోర్ట్‌గా బీజేపీ ముందుకొచ్చింది. మాధవీ లత బీజేపీ ఫాలోవర్ కాబట్టి తనపై ఒక రాజకీయ నాయకుడు అలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని బీజేపీ కార్యకర్తలు ఫీల్ అయ్యి జేసీ ప్రభాకర్‌కు కౌంటర్లు ఇచ్చారు. దాంతో మాధవీ లతకు కొంతవరకు ఉపశమనం లభించినా కూడా తాను కూడా ఈ విషయంపై సెలెంట్‌గా ఉండకూడదనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు మొదలుపెట్టింది.
కావాలంటే చంపేయండి
జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవీ లత. మాటలు అదుపులో పెట్టుకోమంటూ ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది. పైగా జేసీ అన్న మాటలు కరెక్ట్ కాకపోయినా తనకు సపోర్ట్ చేస్తున్నవారిపై కూడా ఫైర్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మాధవీ లతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు తనపై కేసు ఫైల్ అయ్యిందని కూడా అన్నాడు. కానీ తనకు ఏ కేసుకు సంబంధించిన నోటీసులు కూడా రాలేదంటూ తన ఆరోపణలను తిప్పికొట్టింది మాధవీ లత. తనను చంపాలనుకునేవారు నేరుగా వచ్చి చంపేయవచ్చని, తాను మాత్రం ఆడవారి హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
ఎవరూ పట్టించుకోలేదు
సోషల్ మీడియాలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై అప్పుడప్పుడు ఫైర్ అవుతూనే ఉన్న మాధవీ లత.. అక్కడితో ఆగిపోలేదు. తాజాగా ‘మా’ ఆఫీసుకు వెళ్లి ట్రెజరర్ అయిన శివ బాలాజీకి తన ఫిర్యాదును అందజేసింది. ఆ ఫిర్యాదులో అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. మానవ హక్కుల సంఘానికి, పోలీస్ లకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తన మీద చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించలేదని వాపోయింది. మా ట్రెజరెర్ శివబాలాజీ మాత్రమే తన ఫిర్యాదుపై స్పందించి, మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని చెప్పింది. ఎంత కఠినంగా మాట్లాడినా నిజాలు మాత్రమే మాట్లాడతాను కాబట్టి తనకు మా సపోర్ట్ లభించిందని తెలిపింది మాధవీ లత