Daaku Maharaj: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసింది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా (Urvasi rautela).. అంతేకాదు ఈ సినిమాలో కీలక సన్నివేశంలో కూడా నటించింది.ఇక అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif alikhan )కు క్షమాపణలు చెప్పింది. దీంతో అందరూ ఏమైంది? అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఊర్వశి సైఫ్ అలీఖాన్ కు క్షమాపణలు చెప్పడం వెనుక అసలు ఏం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.
సైఫ్ అలీఖాన్ పై దాడి..
అసలు విషయంలోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి, ఏకంగా కత్తితో ఆరుసార్లు దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డాడు. ముంబైలోని తమ ఇంటికి సమీపంలో ఉన్న లీలావతి హాస్పిటల్ కు ఆయనను తరలించారు. దాడిలో ఆరు చోట్ల గాయాలవగా.. అందులో రెండు లోతైన కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు ఆగంతకుడు కత్తితో దాడి చేసినప్పుడు కత్తి లోతుగా దిగి వెన్నెముకకు గుచ్చుకొని విరిగిపోయిందట. ఆ కత్తిని సైతం సర్జరీ చేసి వైద్యులు సక్సెస్ఫుల్గా ఆ కత్తిని బయటకు తీశారు. దీన్ని బట్టి చూస్తే ఆ ఆగంతకుడు సైఫ్ అలీఖాన్ ను ఎంతలా దాడి చేశారో అర్థం చేసుకోవచ్చ.
సైఫ్ అలీఖాన్ కు క్షమాపణలు చెప్పిన ఊర్వశీ..
ఇకపోతే రీసెంట్ గా ఇదే విషయంపై నటి ఊర్వశీ రౌతేలా కూడా స్పందించమని మీడియా వర్గాలు కోరగా.. ఈమె ఆ దాడి గురించి స్పందించకుండా తాను తెలుగులో నటించిన డాక్ మహారాజ్ సినిమాతో రూ.100 కోట్ల మూవీ అందుకున్నారని, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కారణంగా.. తన తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిందని, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడని టాపిక్ ను ఆమె డైవర్ట్ చేసింది. దీంతో సైఫ్ అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా ఈమెపై పూర్తిస్థాయిలో మండిపడ్డారు. దీంతో ట్రోల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది ఊర్వశీ. ” హృదయపూర్వకంగా నేను సైఫ్ అలీఖాన్ కు క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పటివరకు నాకు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిన విషయంలో సీరియస్ నెస్ అర్థం కాలేదు. నా మీద నాకే సిగ్గుగా ఉంది. డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో నాకు వచ్చిన గిఫ్ట్ ల గురించి నేను మాట్లాడడం అసలు కరెక్ట్ గా అనిపించడం లేదు. మీ గురించి అడిగితే నేను మాట్లాడకుండా నా సక్సెస్ గురించి చెప్పాను. దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి. మీ విషయంలో నేను ఇంత మూర్ఖంగా వ్యవహరించాను. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. నా తరఫు నుంచి ఏదైనా సహాయం కావాలంటే ఏ మాత్రం సంకోచించకుండా అడగండి. ఇకపోతే మీ గురించి అడిగినప్పుడు డాకు మహారాజ్ గురించి మాట్లాడినందుకు దయచేసి మరోసారి నన్ను క్షమించండి” అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది ఊర్వశీ రౌతేలా. ప్రస్తుతం ఈమె వదిలిన ఈ నోట్ వైరల్ గా మారుతోంది.