Women’s U 19 T20 World Cup: మహిళల క్రికెట్ లో మరో మెగా ఈవెంట్ కి సమయం ఆసన్నమైంది. మలేషియా వేదికగా జనవరి 18 శనివారం రోజు నుండి అండర్-19 టీ-20 ప్రపంచ కప్ ( ICC under-19 women’s World Cup) ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. గ్రూప్ – ఏ: భారత్, మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్. గ్రూప్ – బి: ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏ. గ్రూప్ – సి: న్యూజిలాండ్, నైజీరియా, సమోవా, దక్షిణాఫ్రికా. గ్రూప్ – డి: ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ నేపాల్ స్కాట్లాండ్.
Also Read: Pakistan Stadium: పాకిస్థాన్ స్టేడియంపై ట్రోలింగ్.. బాత్రూంలో వాడే కుర్చీలంటూ ?
నికీ ప్రసాద్ కెప్టెన్సీలో భారత జట్టు ఆదివారం రోజు తన మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టును ఢీకొట్టనుంది. అయితే మొదటి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్ లోని మిగతా ముగ్గురితో పోటీ పడుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఒక్కో గ్రూప్ లో తొలి మూడు స్థానాలలో ఉన్న జట్లు సూపర్ సిక్స్ ( super six) కి చేరుకుంటాయి. ఈ 12 టీమ్స్ ని సూపర్ సిక్స్ లో రెండు గ్రూపులుగా విభజిస్తారు.
గ్రూప్ 1 లో 6 టీమ్ లు, గ్రూప్ 2 లో మరో 6 జట్లు ఉంటాయి. ఈ సూపర్ సిక్స్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో తొలి రెండు స్థానాలలో ఉన్న నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ కి అర్హత సాధిస్తాయి. ఇక సెమీఫైనల్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్ లో పోటీ పడతాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జనవరి 18 శనివారం రోజున ఈ టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా – స్కాట్లాండ్ మద్య జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లు, నాలుగు గ్రూప్ లు, జట్ల సభ్యుల వివరాలు ఇవే.
గ్రూప్ A:
భారత క్రికెట్ జట్టు: నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే, జి త్రిష, కమలిని జి, భావికా అహిరే, ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత VJ, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD , వైష్ణవి ఎస్.
మలేషియా క్రికెట్ జట్టు: నూర్ దానియా స్యూహదా (కెప్టెన్), నూర్ ఇజ్జతుల్ సయాఫికా, ఇర్డినా బెహ్, నూర్ అలియా, సుయాబికా మణివన్నన్, నూర్ ఇస్మా దానియా, సితి నజ్వా, నూరిమాన్ హిదయా, ఫాతిన్ ఫకిహా అదానీ, మర్స్య ఖిస్టినా, నజతుల్ హిదయ హుస్నా, ఎన్‌సెర్లేయన్, నేసర్లేయన్ బట్రిసియా, నూర్ ఐన్, నుని ఫారిణి.
శ్రీలంక క్రికెట్ జట్టు: మనుడి నానయక్కర (కెప్టెన్), రష్మిక సెవ్వండి, సుముదు నిసంసల, లిమాన్స తిలకరత్నే, విమోక్ష బాలసూర్య, హిరుణి కుమారి, రష్మీ నేత్రంజలి, ప్రముది మెత్‌సర, సంజన కవిందీ, దనులి తెన్నకూన్, దహమి సనేత్మా, అహరాసి ఇందువారీ, షెహరాఇందువరి, చాముడి ప్రభోద.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు: సమర రామ్‌నాథ్ (కెప్టెన్), అసబి కాలండర్, అబిగైల్ బ్రైస్, కెనికా కాసర్, జహజారా క్లాక్స్‌టన్, డెనెల్లా క్రీస్, నైజానీ కంబర్‌బ్యాచ్, ఎరిన్ డీన్, అమియా గిల్బర్ట్, త్రిష హర్దత్, బ్రియానా హరిచరణ్, అమృతా రాంతాల్, సెలీన్ సుథర్‌లాండ్, ఆలియా వారాలు.
గ్రూప్ B:
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు: అబి నార్గ్రోవ్ (కెప్టెన్), ఫోబ్ బ్రెట్, ఒలివియా బ్రిన్స్‌డెన్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, ట్రూడీ జాన్సన్, కేటీ జోన్స్, షార్లెట్ లాంబెర్ట్, ఈవ్ ఓనీల్, డేవినా పెర్రిన్, జెమీమా స్పెన్స్, షార్లెట్ స్టబ్స్, అమురుతా సురెంకుమార్, ప్రిషా థానవాలా, ఎరిన్ థామస్, గ్రేస్ థాంప్సన్.
ఐర్లాండ్ క్రికెట్ జట్టు: నియామ్ మాక్‌నల్టీ (కెప్టెన్), అల్లీ బౌచర్, అబ్బి హారిసన్, జెన్నిఫర్ జాక్సన్, రెబెక్కా లోవ్, లారా మెక్‌బ్రైడ్, కియా మెక్‌కార్ట్నీ, ఎల్లీ మెక్‌గీ, జూలీ మెక్‌నాలీ, జెనీవీవ్ మోరిస్సే, లూసీ నీలీ, ఫ్రెయా సార్జెంట్, ఎంబెల్లీ సార్జెంట్, వాల్ష్.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు: కోమల్ ఖాన్ (కెప్టెన్), జూఫిషన్ అయ్యాజ్, అలీసా ముఖ్తియార్, ఆరీషా అన్సారీ, ఫాతిమా ఖాన్, హనియా అహ్మర్, మహమ్ అనీస్, మహనూర్ జెబ్, మెమూనా ఖలీద్, మినాహిల్, ఖురతులైన్, రావైల్ ఫర్హాన్, షహర్ బానో, తయ్యబా ఇమ్దాద్, వసీఫా హుస్సాన్.
USA క్రికెట్ జట్టు: అనికా రెడ్డి కొలన్ (కెప్టెన్), అదితిబా చూడాసమా, చేతనా రెడ్డి పగిద్యాల, చేతనా జి ప్రసాద్, దిశా ధింగ్రా, ఇసాని మహేష్ వాఘేలా, లేఖ హనుమంత్ శెట్టి, మహి మాధవన్, నిఖర్ పింకు దోషి, పూజా గణేష్, పూజా షా, రీతు ప్రియా సింగ్, సాన్వి ఇమ్మడి, సాషా వల్లభనేని, సుహాని తడాని.
Also Read: Maheesh Theekshana: పెళ్లి చేసుకున్న మాజీ చెన్నై ప్లేయర్.. ఫోటోలు వైరల్
గ్రూప్ సి:
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు: తాష్ వాకెలిన్ (కెప్టెన్), ఎలిజబెత్ బుకానన్, కేట్ చాండ్లర్, సోఫీ కోర్ట్, హన్నా ఫ్రాన్సిస్, కేట్ ఇర్విన్, రిషికా జస్వాల్, లూయిసా కోట్‌క్యాంప్, అయాన్ లాంబాట్, ఎమ్మా మెక్‌లియోడ్, హన్నా ఓ’కానర్, డార్సీ-రోస్ ప్రసాద్ , Anika Tauwhare, Anika Todd, Eve Wolland.
నైజీరియా క్రికెట్ జట్టు: లక్కీ పైటీ (కెప్టెన్), అడెషోలా అడెకున్లే, పెక్యులియర్ అగ్బోయా, అభిషేకించిన అఖిగ్బే, అముసా కెహిండే, డెబోరా బస్సీ (వాక్), జెస్సికా బీని, క్రిస్టాబెల్ చుక్వుయోనీ, ఒమోసిగో ఎగ్వాకున్, విక్టరీ ఇగ్బినేడియన్, నవోమియాయ్, నవోమియాయ్, నవోమియోన్ శాంతి, ఉమో ఇన్యేన్.
సమోవా క్రికెట్ జట్టు: అవెటియా ఫెటు మాపు (కెప్టెన్), ఆలివ్ లెఫాగా లెమో, వెర్రా ఫరానే, ఏంజెల్ సూటగా సో, నోరా-జాడే సలీమా, స్టెఫానియా పాగా, జేన్ తాలి’ఇలాగి మనసే, మసినా టఫియా, సిలేపియా పొలతైవావో, కత్రినా ఉయిసే తా సగాలా, స్టెల్లా, బార్బరా ఎల్లా కెరెసోమా, అపోలోనియా కె పొలతైవావో, సెలీనా లిలో, సాలా విలియము.
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు: కైలా రేనేకే (కెప్టెన్), జెమ్మా బోథా, ఫే కౌలింగ్, జే-లీ ఫిలాండర్, మోనా-లిసా లెగోడి, సిమోనె లౌరెన్స్, కరాబో మెసో, షెష్నీ నాయుడు, న్తాబిసెంగ్ నిని, లుయాండా న్జుజా, డయారా రాంలాకాన్, డైడ్రే వాన్ రెన్స్‌బర్గ్, మియెక్ వాన్ వూర్స్ట్, ఆష్లీ వాన్ వైక్, చానెల్ వెంటర్.
గ్రూప్ D:
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు: లూసీ హామిల్టన్ (కెప్టెన్) క్లో ఐన్స్‌వర్త్, లిల్లీ బాసింగ్‌త్‌వైట్, కావోయిమ్‌హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, హస్రత్ గిల్, అమీ హంటర్, సారా కెన్నెడీ, ఎలియనోర్ లారోసా, గ్రేస్ లియోన్స్, ఇనెస్ మెక్‌కీన్, జూల్ మెక్‌కీన్, , టెగాన్ విలియమ్సన్.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు: సుమైయా అక్టర్ (కెప్టెన్), అఫియా అషిమా ఎరా, మిస్ట్ ఎవా, ఫహోమిదా చోయా, హబీబా ఇస్లాం పింకీ, జువైరియా ఫెర్దౌస్, ఫరియా అక్టర్, ఫర్జానా ఈస్మిన్, అనిసా అక్తర్ సోబా, సుమైయా అక్థర్ సుబోర్నా, నిషితా అక్టర్ నిషి, లక్కీ ఖాతున్, జన్నతుల్ మౌవా , సాదియా అక్టర్, సాదియా ఇస్లాం.
నేపాల్ క్రికెట్ జట్టు: పూజ మహతో (కెప్టెన్), సోనీ పక్రిన్, తిర్సానా బికె, రచనా చౌదరి, సబిత్రి ధామి, క్రిష్మా గురుంగ్, కుసుమ్ గోదార్, సీమనా కెసి, అను కడయత్, కిరణ్ కున్వర్, స్నేహ మహరా, జ్యోత్స్నిక మరాసిని, సనా ప్రవీణ్, రియా శర్మ, అలీషా శర్మ, యాదవ్.
స్కాట్లాండ్ క్రికెట్ జట్టు: నియామ్ ముయిర్ (కెప్టెన్), అమేలీ బాల్డీ, మోలీ బార్బర్-స్మిత్, గాబ్రియెల్లా ఫోంటెన్లా, లూసీ ఫారెస్టర్ స్మిత్, పిప్పా కెల్లీ, మైసీ మసీరా, కిర్స్టీ మెక్‌కాల్, షార్లెట్ నెవార్డ్, మోలీ పార్కర్, నయ్మా షేక్, రోసీ స్పీడీ, రూసీ స్పీడీ, మెకే, ఎమ్మా వాల్‌సింగమ్.
Also Read: Rinku Singh: రింకూ సింగ్ పెళ్లిని అడ్డుకుంటున్న ప్రియా సరోజ్ తండ్రి ?
ఈ అండర్ 19 మహిళల t20 ప్రపంచ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలకి వస్తే.. ఈ మ్యాచ్ లను జియో స్టార్ ప్లాట్ ఫార్మ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇక సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.