Big Stories

Daniel Balaji Passed Away: ఇండస్ట్రీలో మరో విషాదం.. రామ్ చరణ్ మూవీ నటుడు కన్నుమూత!

Daniel Balaji death news
Daniel Balaji

Tamil actor Daniel Balaji death news(Cinema news in telugu): సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది నటీ నటులు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయితే తాజాగా ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటులో తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

గత రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని కొట్టివాకమ్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో బాలాజీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా 48 ఏళ్ల వయస్సులో బాలాజీ మరణించడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ రోజు చెన్నైలో బాలాజీ అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.

- Advertisement -

బాలాజీ మృతి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా బాలాజీ తన కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు చేసి అలరించాడు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. టీడీపీలో చేరిన టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్

అయితే సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలతో అందరినీ ఆకట్టుకున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, రామ్ చరణ్ నటించిన చిరుత, నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో, నాని నటించిన టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.

అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన యాక్టింగ్‌తో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే బాలాజీ 2001లో ‘చితి’ అనే సీరియల్‏ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్‌లో అతడు డేనియల్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

Also Read: లవ్ మ్యారేజ్..ఆమెనే చేసుకుంటా.. కానీ..

ఈ సీరియల్ అనంతరం తన యాక్టింగ్‌కు మెచ్చి సినిమాలో మంచి అవకాశం వచ్చింది. 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక అక్కడ నుంచి తిరిగి వెనక్కి చూసుకోలేదు. పలు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు.

అనంతరం చాలా సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌ చేశాడు. కాగా డేనియల్ బాలాజీ మరెవరో కాదు.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్దలింగయ్య సోదరి కుమారుడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News