MAD Square Collections: సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మత నాగవంశీ (Naga Vamsi) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వెబ్ సైట్లు, రివ్యూలు చెప్పేవారు దమ్ముంటే తన సినిమాను బ్యాన్ చేయాలని సవాల్ విసిరారు. మ్యాడ్ స్క్వేర్ సినిమాకి సంబంధించి పెట్టిన ప్రెస్ మీట్‌లో ‘దమ్ముంటే నా సినిమాలను బ్యాన్ చేయండి!’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇటీవల తన సినిమాలపై కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ.. తీవ్ర స్థాయిలో స్పందించారు. తన సినిమాలకు రివ్యూలు, వార్తలు, ఆర్టికల్స్ రాయవద్దని, ప్రమోషన్స్ లేదా యాడ్స్ కోసం తన వద్దకు రావద్దని ఆయన ఘాటుగా చెప్పారు. “నాకు రివ్యూలపై ఆధారపడాల్సిన అవసరం లేదు, నా సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు” అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇది ఆవేశంలో చెప్పిన మాటా? లేక సినిమా ప్రమోషన్ స్టంటా? అనేది పక్కన పెడితే.. నాగ వంశీ ఇలా రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాగ వంశీ ప్రెస్ మీట్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి అంతా మాట్లాడుతున్నారు.
5 రోజుల్లో 74 కోట్లు!
సక్సెస్ మీట్‌లో.. “మ్యాడ్ స్క్వేర్” సినిమా కలెక్షన్లు ఫేక్ అనే ప్రచారంపై కూడా నాగవంశీ స్పందించాడు. “నేను ప్రొడ్యూసర్లు ప్రకటించిన కలెక్షన్లనే చూపిస్తున్నాను. ఎవరికైనా సందేహం ఉంటే నా వద్దకు వచ్చి లెక్కలు చూడొచ్చు” అని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు 5 రోజుల్లోనే సంచలనం సృష్టించింది మ్యాడ్ స్క్వేర్. నాగవంశీ సవాల్‌కు తగ్గట్టుగా.. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా అధికారిక ప్రకటన చేశారు. 20 కోట్ల ఓపెనింగ్స్‌తో మొదలైన మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్.. ఈ వీకెండ్ వరకు సెంచరీ కొట్టేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందించిన సినిమాగా మ్యాడ్ స్క్వేర్ ఓ సంచలనం అనే చెప్పాలి. మేకర్స్‌కు ఈ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల వరకు జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు పైగా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోగా.. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మ్యాడ్ 2 రిలీజ్ అయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిన మ్యాడ్ 2.. వంద కోట్లతో దుమ్ముదులిపేసేలా ఉంది.
మ్యాడ్ సీక్వెల్‌గా మ్యాడ్ 2
2025 మార్చి 28న విడుదలైన మ్యాడ్ స్క్వేర్.. 2023లో విడుదలై ఘన విజయం సాధించిన “మ్యాడ్” (Mad) సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నార్నే నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఈ సినిమా రూపొందింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాకు.. తమన్ నేపథ్య సంగీతం అందించారు. భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.”మ్యాడ్ స్క్వేర్” కథ ఒక సరదా స్నేహితుల గుండెల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ పెళ్లి ఎపిసోడ్‌తో నిండిన ఫన్ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సెకండ్ హాఫ్‌లో సునీల్, సత్యం రాజేష్ ట్రాక్‌లు కామెడీని మరింత పెంచాయి. “నో లాజిక్, ఓన్లీ ఫన్” అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా సరదాగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తోంది మ్యాడ్ స్క్వేర్.