BigTV English

Kodali heart operation: కొడాలికి గుండె ఆపరేషన్ ఎప్పుడు..? అదీ ముంబైలోనే ఎందుకు..? అంబటి ఏమన్నారంటే..!

Kodali heart operation: కొడాలికి గుండె ఆపరేషన్ ఎప్పుడు..? అదీ ముంబైలోనే ఎందుకు..? అంబటి ఏమన్నారంటే..!

మాజీ మంత్రి కొడాలి నాని గుండె ఆపరేషన్ గురించి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వైసీపీ మాత్రం ఈ విషయంలో కాస్త సంయమనం పాటిస్తోంది. అదే సమయంలో టీడీపీ అనుకూల అకౌంట్లలో మాత్రం ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఆయనకు గుండెపోటు అని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారానే అసలు వార్త బయటకు వచ్చింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో ఆస్పత్రిలో చేరితే చివరికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు వైద్యులు గుర్తించారని అన్నారు. దీన్ని మొదట్లో వైసీపీ ఖండించింది. ఆయనకు గుండె సమస్యలేవీ లేవని చెప్పుకొచ్చింది. తీరా ఆ తర్వాత ముంబైలో ఆపరేషన్ కోసం కొడాలిని ఎయిర్ ఆంబులెన్స్ లో తరలించడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. తాజాగా కొడాలి ఆపరేషన్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు.


ముంబైలోనే ఎందుకు..?
విజయవాడలో, హైదరాబాద్ లోనూ గుండె శస్త్ర చికిత్సలు చేసే మంచి డాక్టర్లు ఉన్నారని, కానీ హైదరాబాద్ లో అయితే ఒత్తిడి ఎక్కువ అవుతుందని ఆయన్ను ముంబైకి తరలించినట్టు చెబుతున్నారు అంబటి. హైదరాబాద్ లో ఆపరేషన్ చేస్తే పరామర్శలకు చాలామంది వస్తారని, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆయన ముంబై వెళ్లారని చెప్పారు. అక్కడ సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న డాక్టర్లు ఉన్నారని, త్వరలోనే కొడాలికి ఆపరేషన్ చేస్తారని అన్నారు.

టీడీపీపై విమర్శలు..
కొడాలి గుండెపోటు వ్యవహారంపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారని, ఇదెక్కడి సంస్కృతి అని అన్నారు అంబటి రాంబాబు. లోకేష్ తన ప్రసంగంలో రెడ్ బుక్ చూస్తే గుండెపోటు వస్తోందని, బాత్రూమ్ లో కాలుజారి పడిపోతున్నారని అన్న వ్యాఖ్యల్ని అంబటి ఖండించారు. సాక్షాత్తూ లోకేషే అలా మాట్లాడితే టీడీపీ క్యాడర్ ఇంకెంత ట్రోలింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులెవరూ ఇలా ముంబై వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్న దాఖలాలు అరుదు. కానీ కొడాలి నేరుగా ముంబై వెళ్లడంతో టీడీపీ మద్దతుదారులు మరింతగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆయన అటునుంచి అటు విదేశాలకు వెళ్లిపోతారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బుక్ లో కొడాలి నాని పేరుందని, నెక్ట్స్ పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేస్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ దశలో కొడాలి నానికి సడన్ గా ఆరోగ్యం పాడవడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఆస్పత్రిలో చేరితే గుండె సమస్య బయటపడటం, వెంటనే హైదరాబాద్ నుంచి ఆయన ముంబై వెళ్లడం.. ఈ వరుస పరిణామాలన్నిటిపై టీడీపీ కౌంటర్లు ఎక్కుపెట్టింది. దీన్ని తప్పించుకోవడం వైసీపీకి కష్టంగా మారింది.


వంశీ తెల్లజుట్టు..
ఇక వల్లభనేని వంశీ తెల్ల జుట్టుపై కూడా అంబటి రాంబాబు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉండటంతో ఆయన జుట్టుకి రంగు వేసుకునే అవకాశం లేదన్నారు. అందుకే తెల్ల వెంట్రుకలు బయటపడ్డాయని, దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. గతంలో తాను కూడా జుట్టుకి రంగు వేసుకునేవాడినని, కానీ ఇప్పుడు మానేశానని చెప్పుకొచ్చారు అంబటి. మొత్తమ్మీద కొడాలి గుండెపోటుని టీడీపీ ట్రోలింగ్ సబ్జెక్ట్ గా మార్చడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు జైలులో ఉండగా, వైసీపీ నేతలు చేసిన ట్రోలింగ్ ని, విసిరిన వ్యంగ్యాస్త్రాలను ఎలా చూడాలో వారికే తెలియాలి.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×