Mad Square OTT : యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలు పెట్టింది.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేస్తుంది. గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ కి సీక్వెల్ గా రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే థియేటర్లోకి వచ్చిన తర్వాత ఊహించిన దాని కంటే ఎక్కువగానే కలెక్షన్స్ రావడం నిజంగానే మామూలు విషయం కాదు. మొదటి షో నుంచి బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డులను బ్రేక్ చేసిన ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ డేట్ వచ్చేసిందని తెలుస్తుంది. ఎప్పుడు? ఎక్కడ? చూడాలో ఒకసారి తెలుసుకుందాం..
ఓటీటీ డీటెయిల్స్..
టాలీవుడ్ నుంచి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ కూడా ఒకటి.. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. మార్చి 28 న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏప్రిల్ 25 నుంచే అలరించేందుకు వచ్చేస్తుంది అని తెలుస్తుంది. అయితే పాన్ ఇండియా భాషల్లో కాకుండా కేవలం తెలుగులోనే ఈ చిత్రం రానున్నట్టుగా సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్..
గతంలో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది.. మొదటి పార్ట్ బాగానే వచ్చింది. మంచి సక్సెస్ ను అందుకుంది. దాంతో ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ వచ్చింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ లో నటించారు. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూలైంది. 2వ రోజు రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా ఫస్ట్ వీక్ లో రూ.38.35 కోట్ల నెట్ రాబట్టింది. మొత్తానికి ఈ మూవీ 74 కోట్ల వసూల్ చేసింది. రెండు వారాలకు మంచి రన్ లో కలెక్షన్స్ ను అందుకుంది. అటు ఓవర్సీస్ లో కూడా 14 రోజుల్లో రూ. 12.45 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సాక్‌నిల్క్ తెలిపింది.. మొత్తానికి ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ 3 రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..