BigTV English

Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mad Square Twitter Review: మ్యాడ్ స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Mad Square Twitter Review: గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. అస్సలు ఊహించని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రావడం ఈమధ్య మనం చూస్తూనే ఉన్నాము.అలాగే ఈ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ మూవీ వచ్చింది. ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ సమర్పకులుగా వ్యవహరించారు.. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు థియేటర్లకి వచ్చేసింది. మరి ఆలస్యమెందుకు ఈ మూవీ గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం..


మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగుతంది. మ్యాడ్ హిట్ అయినట్టే మ్యాడ్ స్క్వేర్ కూడా హిట్ అవుతుంది అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.. కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఇండియాలోను, ఓవర్సీస్‌లోను మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా పరిస్థితి చూస్తే.. యావరేజ్ టాక్ వచ్చినా హిట్ కొట్టేలా ఉంది. ఒకవేళ హిట్ టాక్ వస్తే.. మాత్రం బాక్సాఫీస్ వద్ద డోకా లేకుండా కలెక్షన్స్ ని కుమ్మేస్తుంది అంటూ మరో నెటిజను ట్వీట్ చేశారు.

ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. దర్శకుడు ప్రతి సన్నివేశంలోనూ హాస్యాన్ని నింపాడు. 30 నిమిషాల పాటు సాగే వివాహ క్రమమంతా ఒక నవ్వుల అల్లరి. ఈ సెగ్మెంట్ కోసం దీన్ని చూడండి. నటీనటులందరూ బాగానే నటించారు కానీ ఫస్ట్ హాఫ్‌లో షోను లడ్డు హైలెట్ చేశాడు.. ఓవరాల్ మూవీ సూపర్ ఉంది..

మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ ఆఫ్ డీసెంట్ గా ఉంది.. ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. లడ్డూ మ్యారేజ్ ఎపిసోడ్ నుండి మరింత వినోదాన్ని ఆశించారు. సెకండ్ ఆఫ్ కూడా బాగుంది. ఇక సాంగ్స్ వేరే లెవల్.

మ్యాడ్ స్క్వేర్ సినిమా విన్నర్. ఈ సినిమాలో సిట్యుయేషనల్ కామెడీ టాప్ గేర్‌లో ఉంటుంది. మరోసారి కల్యాణ్ శంకర్ లాజిక్ లేని కామెడీతో నాన్సెన్స్ ఫన్ క్రియేట్ చేశారు. ఈ సీక్వెల్ బాగా వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయింది. లడ్డు గాడి పెళ్లి విషయంలో జరిగిన హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. భాయ్, లడ్డూ మధ్య కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది అని నెటిజన్ కామెంట్ చేశారు.

ఫస్టాఫ్ చాలా బాగుంది.. థియేటర్ కొచ్చిన ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.. వెడ్డింగ్ సీక్వెన్స్‌లో కామెడీ చాలా బాగా పనిచేసింది. ఇప్పటి వరకు లడ్డూ షో స్టీలర్. అక్కడక్కడా కొన్ని డ్రాప్స్ ఉన్నా కూడా సినిమా మొత్తం కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంది. హిట్టు కొట్టడం ఖాయమే అంటూ నెటిజన్ వెయిట్హిట్టు కొట్టడం ఖాయమే అంటూ నెటిజన్ ట్వీట్ చేశారు.

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నవ్వించే ప్రయత్నం చేశారు. రెబ్బా మోనికా జాన్ స్పెషల్ సాంగ్ గ్లామర్ అట్రాక్షన్ గా ఉంటుంది. మ్యూజిక్ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా మ్యాడ్ స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ లేదని అంటున్నారు. ఈ చిత్రం యూత్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టే బాక్సాఫీస్ రిజల్ట్ ఉంటుంది. మొదటి షోకేతే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ను రాబడుతుందో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×