OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలను ఓటీటీలో కూడా మన ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తారు. అయితే వీటిలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. చివరివరకూ సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తాయి ఈ సినిమాలు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హాస్పిటల్ కి వచ్చిన ఒక వ్యక్తికి, తన భార్యా కూతురు కనిపించకుండా పోతారు. అతను వాళ్ళను వెతికే క్రమంలో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫ్రాక్చర్డ్’ (Fractured). 2019 లో వచ్చిన ఈ మూవీకి బ్రాడ్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సామ్ వర్థింగ్టన్, లిలీ రాబే, స్టీఫెన్ టోబోలోవ్స్కీ, లూసీ కాప్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో హీరో భార్య కూతురిని వెతికే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ప్రతి సీన్ ఈ మూవీలో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
రే మన్రో అనే వ్యక్తి తన భార్య జోవాన్, కూతురు పెరితో కలిసి రోడ్ ట్రిప్‌కి వెళతాడు. వాళ్ళు సరదాగా గడుపుతూ, ఒక రోజు వారు గ్యాస్ స్టేషన్ వద్ద ఆగుతారు. అక్కడ ఆగినప్పుడు గ్యాస్ స్టేషన్ వద్ద, పెరి ఒక ప్రమాదంలో గాయపడుతుంది. ఆమె చేయి విరిగినట్లు అనిపించడంతో, జోవాన్ తో కలసి రే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళతాడు.పెరికి మరింత తీవ్రమైన గాయం ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తారు. ఆమెను CT స్కాన్ కోసం ఒక చోటికి తీసుకెళతారు. జోవాన్ కూడా ఆమెతో పాటు వెళుతుంది. రే ఆసుపత్రి వెయిటింగ్ ఏరియాలో కాసేపు నిద్రపోతాడు. అతను మేల్కొన్న తర్వాత, తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఎంత వెతికినా వాళ్ళు కనిపించరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఆసుపత్రి సిబ్బందిని అడిగితే, వాళ్ళు కూడా ఇక్కడికి ఎవరూ రాలేదని సమాధానం చెప్తారు.
అలాంటి రోగి రికార్డులు కూడా ఇక్కడ లేవని చెప్పడంతో, రే గందరగోళంలో పడిపోతాడు. తన కుటుంబం ఆసుపత్రిలోనే ఎక్కడో ఉన్నారని అనుకుంటాడు. అతను వారిని అక్కడే వెతకడం మొదలు పెడతాడు. కానీ ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు కూడా అతని మాటలను నమ్మరు. మళ్ళీ గ్యాస్ స్టేషన్ కి కూడా వెళ్ళి చెక్ చేస్తాడు. అతనికి ఏమీ అర్థం కాకుండా పోతుంది. రేకి క్రమంగా తన మానసిక స్థితిపై సందేహం కలిగి, ఏం జరిగిందనే దాని గురించి కనుగొనే ప్రయత్నం చేస్తాడు. చివరికి రే తన భార్యా కూతురిని కనిపెడతాడా ? వాళ్ళు ఏమైపోతారు ? హాస్పిటల్ లో ఏం జరుగుతుంది ? రేకి మానసికంగా సమస్య ఉంటుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.