Hyderabad : హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తెలుసుగా. ఫుల్ ఫేమస్. ఇటీవల పుష్ప 2 మూవీ తొక్కిసలాట జరిగింది ఇక్కడే. నిత్యం ఫుల్ రద్దీగా ఉండే ప్రాంతం. ఏ కొత్త సినిమా అయినా.. ఫ్యాన్స్ ఫస్ట్ ప్రయారిటీ సంధ్యనే. అలాగని అదేమీ సూపర్ డూపర్ లగ్జరీ థియేటర్ ఏమీ కాదు. ఓ మామూలు సాధారణ సినిమా హాల్. కాస్త ఇరుకిరుకుగానే ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉండటం.. మాస్ పీపుల్ వస్తుండటం వల్ల అది అంత ఫేమస్ అయింది. కొత్త సినిమాలతో కళకళలాడే ఆ థియేటర్‌లో పాముల కలకలం చెలరేగింది.
రూ.50 టికెట్స్ తీసుకున్న వారు లోనికి ఎంట్రీ అయ్యే చోట పెద్ద పాము కనిపించింది. చాలా పొడుగ్గా ఉందా పాము. బుస్ బుస్ మంటూ బుసలు కొడుతోంది. చూస్తేనే హడలిపోవాల్సిందే. దెబ్బకు దడుసుకున్నారు అక్కడ ఉన్న వారంతా. కాకపోతే ఆ టైమ్‌లో ఆడియన్స్ ఎవరూ ఆ ఎంట్రీ దగ్గర లేరు. థియేటర్ స్టాఫే ఆ పామును చూశారు. వెంటనే పాములు పట్టే స్నేక్ యూనిట్ వారికి ఫోన్ చేస్తే.. వాళ్లొచ్చి పట్టేశారు. మనిషి ఎత్తుకంటే పొడుగ్గా ఉంది ఆ పాము. చాకచక్యంగా పట్టేసి తమతో పట్టుకెళ్లిపోయారు స్నేక్ క్యాచర్స్.
సంధ్య థియేటర్‌లో పాము కనిపించడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదంటున్నారు. తరుచూ ఇక్కడికి పాములు వస్తుంటాయని సిబ్బంది చెబుతున్నారు. అదేంటి? అంత ఈజీగా ఎలా అనేస్తు్న్నారు ఆ మాట. వందలాది మంది వచ్చే సినిమా థియేటర్‌లోకి పాములు రావడమేంటి? ఇప్పుడంటే ప్రేక్షకులు లేరు కాబట్టి సరిపోయింది. అదే అక్కడ జనాలు ఉండి ఉంటే? పరిస్థితి ఏంటి? పాము ఎవరినైనా కాటేసు ఉంటే? వారు చనిపోతే? సంధ్య థియేటర్‌ను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఆ పామును పట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింద కామెంట్లు సైతం అదిరిపోతున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి….
అది సినిమా థియేటరా? పాముల పుట్టనా?
ఆర్టీసీ ఎక్స్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో పాముల కలకలం
రూ.50 టికెట్ ఎంట్రీ వద్ద థియేటర్ సిబ్బంది కంటపడ్డ పాములు
పాములు తరచుగా లోపలికి వస్తున్నాయని సిబ్బంది ఆందోళన#SandhyaTheatre #RTCXRoads #Sandhya70MM pic.twitter.com/pgAea2vi1V
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 11, 2025