BigTV English
Advertisement

Madhavi Latha : మగాడిలా పోరాడుతున్నా… భోరున ఏడ్చిన హీరోయిన్

Madhavi Latha : మగాడిలా పోరాడుతున్నా… భోరున ఏడ్చిన హీరోయిన్

Madhavilatha : బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు వార్తల్లో హైలెట్ అవుతుంది.. సమాజంలో జరిగే ప్రతి విషయంలోనూ రెస్పాండ్ అవుతూ ట్రోల్స్ వేయించుకుంటుంది. ఇక రాజకీయాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు. ముందున్నది ఎవరు అన్నది లెక్క చెయ్యకుండా నోటికి వచ్చింది అంటుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతుంది. ఇక తాజాగా ఈమె జేసి ప్రభాకర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. అవి రాజకీయాల్లో దుమారం రేపాయి. అటు ప్రభాకర్ రెడ్డి కూడా మాధవిలత పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరకు ఆయన తప్పయిందని క్షమాపణలు కోరారు. తాజాగా మాధవిలత ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


అసలేం జరిగిందంటే..? 

న్యూయర్ సందర్బంగా తాడిపత్రిలో జేసి ప్రభాకర్ మహిళలకు మాత్రమే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలకు మాత్రమే అనుమతి అని చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి మహిళలు వెళ్లొద్దంటూ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, దాడులు చేస్తే ఎవరిది బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.. చివరకు ఆవేశంలో ఏదో అన్నాను నన్ను క్షమించండి అని అన్నారు. ఇక అక్కడితో ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా మాధవిలత మరో వీడియోను రిలీజ్ చేసింది. అది నెట్టింట హల్ చల్ చేస్తుంది..


మాధవిలత వీడియోలో ఏముందంటే..? 

మాధవిలత ఒక వీడియోను తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు.. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే …నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి … ..నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది. కోపం, నిరాశ, ఆవేదన , దుఃఖం ..అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. కానీ, ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు , పదే పడే ఇవే మాటలన్నారు. నా పార్టీ ( ప్రజల) కోసం , మహిళల కోసం , హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. రూపాయి తీసుకున్నది లేదు ..ఎవరికి ద్రోహం చేసింది లేదు , మోసం చేసింది లేదు , కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు …ఆడపిల్లగా ఎపుడు నేను సింపతీ గేమ్ ఆడలేదు ఉమెన్ పవర్ లాస్ ను ఉపయోగించలేదు మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను, నాకు కుటుంబం , స్నేహితులు ఉన్న సరే నా అభిమానులు , సోషల్ మీడియా లో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు ..నా బాధని మీతో పంచుకున్నందుకు…. క్షమించండి … మీ ప్రేమ అభిమానం , ఆశీర్వాదాలు నాకు శక్తిని ఇస్తాయని ఆమె వీడియో అన్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×